రాజమౌళికి మరో షాక్.. RRR నుంచి ఆలియాభట్ అవుట్.. కారణం అదేనట!
బాహుబలి తర్వాత RRR మూవీని ఏ ముహుర్తాన మొదలుపెట్టారో తెలియదు గానీ.. దర్శక ధీరుడు రాజమౌళికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తొలుత ఈ చిత్రం నుంచి హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం చిత్ర యూనిట్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్ గాయాలు సినిమా షెడ్యూళ్లను సినిమా భవితవ్యాన్ని తారుమారు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఆలియాభట్ తప్పుకోన్నారనే వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

ఆసక్తిగా మారిన ఆలియా భట్ ఎంట్రీ
RRR చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తుండగా.. ఆయనకు జోడిగా బాలీవుడ్ తార ఆలియాభట్‌ను ఎంపిక చేశారు. అయితే ఆలియాభట్ చిత్ర యూనిట్‌లో ఎప్పుడు రంగ ప్రవేశం చేస్తుందనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూశారు. ఆమె గుజరాత్, ఉత్తర భారతంలో రూపొందించే షెడ్యూల్‌లో ఆలియా ప్రవేశిస్తారని అనుకొనే లోపే రాంచరణ్ గాయాల బారిన పడటంతో ఆమె రాక ఆగిపోయింది.

రాజమౌళికి షాకిచ్చి యూఎస్‌కు
ఆ తర్వాత మరోసారి ఆలియా భట్‌ను సినిమా షూటింగ్ రప్పించాలని చిత్ర యూనిట్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. రాజమౌళి ప్లాన్ చేసుకొంటే ప్రియుడు రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ క్యాన్సర్ వ్యాధిన పడటంతో అతడిని పరామర్శించడానికి చెప్పపెట్టకుండా అమెరికాకు వెళ్లిపోవడంతో మరోసారి చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది.

ఆలియా డేట్ల సమస్య
అలా రకరకాల కారణాల వల్ల ఆలియాభట్‌పై చిత్రీకరించే సన్నివేశాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా మార్చి 15న ఆలియా షూటింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆమె రాకపోవడంతో మరోసారి సన్నివేశాల చిత్రీకరణ వాయిదా పడినట్టు సమాచారం. అయితే ఆమె డేట్ల సమస్య తలెత్తడంతో వాటిని సర్దుబాటు చేసే పనిలో ఉన్నట్టు సమాచారం.

ఆలియా మేనేజర్‌తో
RRR షూటింగ్ పలుమార్లు వాయిదా పడటం కారణంగా ఇప్పుడు ఆలియాభట్ డేట్స్ అడ్జస్ట్ కావడం తలకు మించిన భారంగా మారిందనేది ఇన్‌సైడ్ టాక్. ఆలియా మేనేజర్‌తో డేట్ల అడ్జస్ట్‌మెంట్ కోసం దర్శక ధీరుడు కుస్తీ పడుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఆలియా డైరీ పూర్తిగా నిండిపోవడంతో మేనేజర్ చేతులెత్తే పరిస్థితి కనిపిస్తుందట. దాంతో ఆలియా భట్ RRR తప్పుకొన్నదనే మాట వినిపిస్తున్నది.
Recommended Video

పలు ప్రాజెక్టులతో ఆలియా బిజీ
బాలీవుడ్‌లో ఆలియభట్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, అమితాబ్, నాగార్జున నటిస్తున్న బ్రహ్మస్త్రలో ఆమె నటిస్తున్నారు. ఇంకా సంజయ్ దత్ సడక్2, సంజయ్ లీలా భన్సాలీ గుంగుభాయ్ కతియావాడీ సినిమాలో ఆలియా నటిస్తున్నది. ఇక RRR విషయం అధికారికంగా తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











