పక్కా పన్నాగంతోనే బన్నీ అరెస్ట్? అనుమానాలు రేకెత్తిస్తున్న ప్రశ్నలు..
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో మారు మోగుతున్న సినిమా పేరు పుష్ప 2 ది రూల్. అయితే దీనికి మించి ఆ సినిమా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మరింత స్థాయిలో వైరల్ గా మారింది. ఈ సినిమాతో పాటుగా రీసెంట్ గా జరిగిన ఓ కాంట్రవర్సీ నేపథ్యంలో తనని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో తనని అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకి కూడా పంపడం పైగా 14 రోజులు రిమాండు అంటూ వచ్చిన వార్తలు హై టెన్షన్ వాతావరణం తీసుకొచ్చాయి.
దీనితో అల్లు అర్జున్‌ని ఇంతలా టార్గెట్ చేసి కావాలనే అరెస్ట్ చేశారా అంటూ పలు కామెంట్స్ కూడా వినిపిస్తూ వస్తున్నాయి. అల్లు అర్జున్ నిజానికి ఆ బాధిత కుటుంబం విషయంలో ప్రత్యక్షంగా బాధ్యుడు కాదని అంతా అంటున్నారు. ఆయన ఇప్పుడే కాదు .. గతంలోనూ చాలా సార్లు తన ప్రతి సినిమా రిలీజ్ నాడు మొదటి ఆట అభిమానులతో చూడటం అలవాటు. కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే ఇపుడు ఇలా జరగడం అనేది చాలా అన్ ఫార్చునేట్ అని చెప్పుకొచ్చాడు.

అయితే అసలు అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం పక్కా పన్నాగం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో డిస్కష్ చేసుకుంటున్నారు. ఇందుకు వారు పలు ప్రశ్నలు కూడా తెరపైకి తెస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ లేదా విచారణ కోసం అయితే ముందే తీసుకెళ్లాలి కానీ సరిగ్గా శుక్రవారమే తీసుకెళ్లడం? తనని జైల్లో పెడితే వరుసగా రెండు రోజులు శనివారం, ఆదివారం కోర్ట్ సెలవు కాబట్టి ఆ రెండు రోజులు కూడా బన్నీ బయటకి రాకుండా చేయాలనే నెపంతో ప్లాన్ చేశారంటూ వాదిస్తున్నారు.
అలాగే దీనితో పాటుగా అల్లు అర్జున్‌కి నిన్న సాయంత్రానికే బెయిల్ వచ్చేస్తే.. దానిని సాంకేతిక లోపాలతో ప్రింట్ రాలేదు పేర్లు, అక్షరాలు తప్పు ఉన్నాయి అని చూపించే కారణాలు కూడా పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. అన్నింటికి మించి అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు కుటుంబానికి మధ్య ఏం జరిగింది అని అంటూ ఇండస్ట్రీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి

దీనితో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మాత్రం ఓ హైడ్రామా నడుస్తుంది అని చెప్పాలి. మొత్తానికి బన్నీ అయితే బయటకి వచ్చేసాడు. దీంతో అల్లు , మెగా ఫ్యాన్స్ తన విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు అంతా తన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు. మరో పక్క పుష్ప 2 చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకొని సంచలనం కొనసాగిస్తుంది.


Click it and Unblock the Notifications











