పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ .. పుష్ప 2 రిలీజ్ ముందు భేటీ !
Mega vs Allu: సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోల అభిమానుల మధ్య వివాదాలు రావడం సర్వసాధారణమే. తమ హీరో గొప్ప అంటే.. తమ హీరోనే గొప్ప అంటూ ఫ్యాన్స్ కొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ, టాలీవుడ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వేరు. ఒకే కుటుంబానికి చెందిన స్టార్ హీరోస్ ఫ్యాన్స్ మధ్య వివాదం జరుగుతోంది. అదే అల్లు వర్సెస్ మెగా (Mega vs Allu) ఫ్యాన్స్ వార్. గత కొన్ని నెలలుగా ఈ ఫ్యాన్ వార్ కొనసాగుతున్నది. దీంతో ఫ్యాన్స్ మధ్య చీలిక ఏర్పడింది. ప్రస్తుతం ఈ వివాదం తార స్థాయికి చేరుకుంది. ఈ ఫ్యాన్ వరకు ముగింపు పలికేలా అల్లు అర్జున్ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాడట. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి ? మరీ ఆ నిర్ణయంతో ఫ్యాన్ వార్ కు ఎండ్ కార్డ్ పడేనా?
మెగా వర్సెస్ అల్లు వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. వాస్తవానికి టాలీవుడ్ లో మెగా, అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా ఎన్నడూ చూడలేదు. కాదు కూడా.. కానీ, సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ పరిస్థితి మారిపోయాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు. కానీ, అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే.. భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నిక సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా.. అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున నంద్యాల లో ప్రచారం చేయడం వివాదస్పదం మారింది.

అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలకు అల్లు అర్జున్ శత్రువుగా మారాడు. ఈ తరుణంలో అగ్నికి ఆజ్యం పోయినట్టు.. మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ పై కామెంట్స్ చేశారు. దీంతో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి ఒకరు కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. పుష్ప సినిమా స్టోరీ, అల్లు అర్జున్ పై పరోక్షంగా కామెంట్లు చేశారు. ఇలా వరుస అంశాలతో మెగా వర్సెస్ అల్లు ఫాన్స్ వార్ ప్రారంభమైంది. మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఆజ్యం పోశాయి.
తాజాగా కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏకంగా పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి 'ఎవడు వస్తాడో చూసుకుందాం రండి', 'ఏం పీకలేరు బ్రదర్స్' అంటూ సినిమా రేంజ్ లో డైలాగులతో బ్యానర్లు కటి.. మెగాఫ్యాన్స్ కు బహిరంగంగా సవాలు విసిరారు. పరోక్షంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేశారు. దీంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇలా వివాదాస్పద బ్యానర్స్, ఫోటోలను షేర్ చేస్తూ అల్లు అర్జున్ అభిమానులు కైయ్యానికి కాలు దువ్వుతున్నారు. ప్రస్తుతం ఆ బ్యానర్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా 'పుష్ప 2' మూవీ రిలీజ్ కాబోతున్న తరుణంలో రివేంజ్ మూవీ కలెక్షన్లపై పడే అవకాశముంది.
పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న థియేటర్లకు రాబోతుంది. అంటే.. సరిగ్గా నెల రోజుల తరువాత పుష్ప 2 మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ వార్ ఇలా సాగితే.. పుష్ప 2 కలెక్షన్లపై ప్రభావం పడి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో మూవీ మేకర్స్.. అల్లు అర్జున్ ను రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వివాదానికి ఎలాగైనా ఎండ్ కార్డ్ పడేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో అల్లు అర్జున్ భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ భేటీలో అల్లు అర్జున్ తోపాటు పుష్ప మూవీ మేకర్స్ కూడా పాల్గొబోతున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ లో పుష్ప మూవీ టికెట్స్ పెంపుపై కూడా చర్చించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది.
ఒకవేళ అనుకున్న.. పవన్ కళ్యాణ్- అల్లు అర్జున్ ల భేటీ జరుగుతే.. మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ కు తెరపడే అవకాశముంది. అలాగే పుష్ప 2 మూవీ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నెల రోజులలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఇక పుష్పా 2 మూవీ భారీ బడ్జెట్ తో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 1,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఏం జరుగుతోందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











