త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమా టైటిల్ ఇదే.. క్రేజీగా వైరల్
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌కు రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు సీనియర్ నటి టబు, నవదీప్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.
సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలకు మహిళ నేపథ్యంతో టైటిల్స్ ఖారారు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన అలకానంద అనే పేరు పెడుతున్నట్టు ప్రముఖంగా వినిపించింది. అయితే ప్రస్తుతం వైకుంఠపురంలో అనే టైటిల్ సినీ వర్గాల్లో నానుతున్నది. ఈ సినిమా టైటిల్‌ను ఆగస్టు 15వ తేదిన విడుదల చేస్తున్నట్టు సినిమా యూనిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 'వైకుంఠపురం'లో టైటిల్ కథకు సరిపోతున్నదనే మెజార్టీ సభ్యుల ఆమోదంతో అదే టైటిల్‌ను అనౌన్స్ చేయాలని అనుకొంటున్నట్టు తెలుస్తున్నది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు నిర్మాతలుగా అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











