twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వక్కంతం కాపీ కొట్టాడా?: బన్నీ 'నా పేరు సూర్య'కు మూలం ఆ సినిమాయేనా!..

    |

    Recommended Video

    'నా పేరు సూర్య' ఆ సినిమా కు కాపీ నా ?

    హిట్టు సినిమా తీయాలంటే హాలీవుడ్ నుంచి కథలు ఎత్తుకురావాల్సిందేనా?.. అయినా అంతలా ఎవరు గమనిస్తారులే అనుకుంటే అడ్డంగా బుక్కయిపోయినట్లే. 'అజ్ఞాతవాసి' విషయంలో త్రివిక్రమ్‌పై పడ్డ మచ్చ తుడుచుకుంటే పోయేదా?.. ఇంత జరిగినా! మన దర్శకుల తీరులో మార్పు రావట్లేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్-వక్కంతం వంశీ కాంబినేషన్‌లో వస్తున్న 'నా పేరు సూర్య' సినిమాపై కూడా ఇప్పుడు కాపీ ఆరోపణలు వస్తుండటం గమనార్హం.

    నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..

     'ఆంట్వోన్ ఫిషర్' లైన్‌తోనే:

    'ఆంట్వోన్ ఫిషర్' లైన్‌తోనే:

    'నా పేరు సూర్య' సినిమా లైన్‌ను 'ఆంట్వోన్ ఫిషర్' అనే హాలీవుడ్ నుంచి తీసుకున్నట్లు ప్రచారం మొదలైంది. 2002లో 'ఫైండింగ్ ఫిష్' అనే నవల స్ఫూర్తిగా తెరకెక్కిన 'ఆంట్వోన్ ఫిషర్' ఆధారంగానే 'నా పేరు సూర్య' దర్శకుడు వక్కంతం వంశీ కథ అల్లుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఏంటా లైన్..:

    ఏంటా లైన్..:

    నిగ్రహం అనే పదానికి అర్థమే తెలియని ఓ యువకుడు.. అతని కోపం కారణంగా సైన్యంలో కొన్ని శిక్షలకు గురవుతాడు. అతని ఆవేశం, కోపంపై ఉన్న ఫిర్యాదులతో.. ఓ సైక్రియాటిస్ట్ వద్దకు అతన్ని పంపించి క్లీన్ చిట్ తెచ్చుకోవాలంటారు.

     'కీ' పాయింట్స్:

    'కీ' పాయింట్స్:

    ఆ సైక్రియాటిస్ట్ అతని తండ్రే కావడం.. అతను క్లీన్ చిట్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడం కథలో హైలైట్‌గా నిలుస్తుంది. అయితే కొడుకుకు కొన్ని కఠిన పరీక్షలు పెట్టి.. అతని పట్ల సంతృప్తి చెందాక సర్టిఫికెట్ ఇష్యూ చేస్తాడు. కానీ అప్పుడు దాన్ని తీసుకోవడానికి కొడుకు నిరాకరిస్తాడు. బోర్డర్ లో కంటే ఇక్కడే ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఉండిపోతానంటాడు.

    వక్కంతం కాపీ కొట్టాడా?:

    వక్కంతం కాపీ కొట్టాడా?:

    'ఆంట్వోన్ ఫిషర్'లో ఉన్న ఈ లైన్ తోనే ఇప్పుడు నా పేరు సూర్యను వక్కంతం వంశీ తెరకెక్కించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీజర్‌లో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో పాత్రకు దగ్గరిగా ఉండటం.. కథాంశం కూడా సైన్యానికి సంబంధించిందే కావడంతో.. వక్కంతం వంశీపై కాపీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

     గతంలోనూ..:

    గతంలోనూ..:

    రచయితగా మారిన వక్కంతం వంశీపై గతంలోనూ కాపీ ఆరోపణలు వచ్చాయి. జెంటిల్ మన్ కథను కలగాపులగం చేసేసి కిక్ కథ వండేసినట్లు ఆయనపై విమర్శలున్నాయి.

     కాపీ సంగతి పక్కనపెడితే..:

    కాపీ సంగతి పక్కనపెడితే..:

    కాపీ ఆరోపణల సంగతెలా ఉన్నా.. 'నా పేరు సూర్య'పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ ఇంపాక్ట్ అంటూ రిలీజ్ చేసిన టీజర్.. సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఈమధ్యే విడుదల చేసిన సోల్జర్స్ సాంగ్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. మొత్తంగా 'నా పేరు సూర్య' విడుదల కోసం ఇప్పుడు చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. చూడాలి మరి.. విడుదల తర్వాత ఈ సినిమా కాపీ ఆరోపణలకు గురవుతుందా?.. లేక అదేమి లేదని కొట్టిపడేస్తారా?..

    English summary
    Allu Arjun-Vakkantham Vamshi much anticipated film 'Naa Peru Surya' is plagued by rumours of being inspired by hollywood film Antwonefisher
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X