twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    AA20 టైటిల్ లీక్.. బన్నీ-సుకుమార్ రెండక్షరాలకే ఫిక్స్.. అల్లు అర్జున్ పాత్ర పేరు ఏంటంటే?

    |

    అల వైకుంఠపురములో లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయే సుకుమార్ చిత్రంపై ఎంతటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా అంచనాలు పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సుకుమార్ తెరకెక్కించే సినిమా కావడం, ఇదివరకే వీరి కాంబోలో ఆర్య, ఆర్య2 వంటి హిట్ చిత్రాలు రావడంతో హ్యాట్రిక్ అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    దీనికి తగ్గట్టే ఇప్పటి వరకు లీకైన స్టోరీ, బన్నీ లుక్ సినిమా అమాంతం అంచనాలను రెట్టింపు చేశాయి. రేపు (ఏప్రిల్ 8) బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు సినిమా టైటిల్ లీక్ అయిందంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆ టైటిల్ ఏంటో, వాటి సంగతేంటో ఓ సారి చూద్దాం.

    బన్నీ-సుకుమార్ కాంబోలో..

    బన్నీ-సుకుమార్ కాంబోలో..

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఓ రేంజ్ అంచనాలుంటాయి. పైగా ఇద్దరూ ఇండస్ట్రీ హిట్స్ కొట్టి ఉన్నారు. ఇప్పుడు చేయబోయే ఈ సినిమా నేపథ్యం, బన్నీ క్యారెక్టరైజేషన్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ బన్నీ బర్త్ డేకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది.

    కలిసొచ్చిన రెండక్షరాల టైటిల్..

    కలిసొచ్చిన రెండక్షరాల టైటిల్..

    ఇప్పటి వరకు వీరు చేసిన రెండు సినిమాల టైటిల్స్ రెండక్షరాలే. ఆర్య, ఆర్య 2లా ఈ సారీ రెండక్షరాల టైటిల్ కోసమే ప్రయత్నించారట. మొదట శేషాచలం అంటూ ఓ టైటిల్ చక్కర్లు కొట్టినా.. అది ఫేక్ అని కొట్టి పారేశారు. తాజాగా ఓ రెండక్షరాల టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

    యాసతో అదరగొట్టేశాడు..

    యాసతో అదరగొట్టేశాడు..

    ఏమబ్బా.. అందరూ బాగుండారా.. మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాండే.. అప్ డేట్.. ఏప్రిల్ 8న తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది అంటూ రాయలసీమ యాసలో అదిరిపోయేట్టు ప్రకటించారు. దీన్ని బట్టి బన్నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో అంచనా వేయవచ్చు.

    Recommended Video

    Buttabomma Video Song Crossed 100 Million Views | Viral In TikTok As well
    టైటిల్ లీక్..

    టైటిల్ లీక్..

    అయితే ఈ రెండక్షరాల టైటిల్ ఇదేనంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పుష్ప అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు.. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పక్ నారాయణ్‌గా నటించబోతోన్నట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

    English summary
    Buzz Is That Allu Arjun Sukumar Project Title Pushpa. And Allu Arjun Is Hoing Paly A Role Named As Pushpak Narayan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X