రాజకీయాల్లోకి "పుష్ప".. పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టేందుకే అతన్ని కలిశాడా?
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు "పుష్ప". ఇండియన్ సినిమా దగ్గర పలు ఐకానిక్ సినిమాలు అండ్ ఐకానిక్ సినిమాల పాత్రలు ఉన్నాయి. మరి వాటిలో బాహుబలి సినిమా నుంచి బాహుబలి, కేజీఎఫ్ నుంచి రాకీ భాయ్ ఇపుడు కొత్తగా పుష్ప నుంచి పుష్పరాజ్‌లు ఒక ఐకానిక్ చోటుని పాతుకున్నాయి. ఇపుడు పుష్పరాజ్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో కొత్తగా యాడ్ అయ్యాడు.
కాగా బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని ఫాస్టెస్ట్ రికార్డులు సెట్ చేస్తుండగా సినిమాల పరంగా పక్కన పెడితే బయట మాత్రం బన్నీ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుమ ఉన్న చిన్నపాటి కోల్డ్ వార్ అయితే వారి అభిమానుల్లో సీరియస్ గా మారింది.

ఓ పక్క పవన్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ కామెంట్స్, అలాగే వేరే పార్టీలో ఉన్న తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడం అనేది మెగా అభిమానుల అహాన్ని దెబ్బ తీశాయి. దీనితో అక్కడ నుంచి చాలా రచ్చే జరిగింది కానీ రీసెంట్ గానే పుష్ప 2 కి ఇచ్చిన హైక్స్ తో అల్లు అర్జున్ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్‌కి స్పెషల్ థాంక్స్ చెప్పడం అనేది పొలిటికల్ పరంగా ఓ పార్టీ కేడర్‌ను గట్టిగా హర్ట్ చేసింది. దీనితో వారు అల్లు అర్జున్ గురించి నెగిటివ్ గా మాట్లాడ్డం స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉండగా ఇపుడు అల్లు అర్జున్ తన పీక్ కెరీర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బన్నీపై పలు షాకింగ్ వార్తలు కూడా వచ్చాయి. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అని అందుకే ప్రముఖ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని కలిసాడు అని.. మరీ ముఖ్యంగా పవన్ కి పోటీగా దిగుతున్నాడు అంటూ పలు షాకింగ్ రూమర్స్ బయటికి వచ్చాయి.

ఈ వార్తలు తెలుగునాట సంచలనం సృష్టించడంతో ఇపుడు అల్లు అర్జున్ టీమ్ నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ పై వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. అఫీషియల్ కాని వార్తలని నమ్మొద్దు అంటూ అల్లు అర్జున్ టీం కన్ఫర్మ్ చేసింది. సో అల్లు అర్జున్ రాజకీయ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.
కాకపోతే అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాకుండా ఏవో సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాడు అంటూ మరో వెర్షన్ వినిపిస్తుంది. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఆయన నటించిన పుష్ప 2 చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇపుడు 1100 కోట్ల మార్క్ దగ్గరకి చేరి మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తుంది. మరి పుష్ప రాజ్ హవా ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే .


Click it and Unblock the Notifications











