తెలుగు డైరెక్టర్లకు అల్లు అర్జున్ బై బై.. మలయాళ డైరెక్టర్ కి బన్నీ గ్రీన్ సిగ్నల్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన రాబోయే చిత్రాల విషయం బన్నీ ఏమాత్రం తొందర పడటం లేదు. చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలకు ఉన్న రికార్డులను చెరిపేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తన 22వ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ 23వ చిత్రంపై తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. మలయాళ దర్శకుడికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ గాసిప్ మొదలైంది. ఆ వివరాల్లోకి వెళితే..
పుష్ప2 తర్వాత భారీ మార్పులు..
అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో చివరిగా వచ్చిన పుష్ప 2 : ది రూల్ చిత్రం తర్వాత భారీ మార్పులు జరిగాయి. అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పుష్ప2తోనే అల్లు అర్జున్ 2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలని చూశారు. కానీ అది వీలు పడలేదు. 1870 కోట్ల మార్క్ ను రీచ్ అయ్యారు. కానీ నెక్ట్స్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న AA22xA6 చిత్రంతో భారీ టార్గెట్స్ ను రీచ్ అవ్వాలి చూస్తున్నారు. ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్లను ఈ ప్రాజెక్ట్ కు హైర్ చేసుకోవడం విశేషం. మరోవైపు బన్నీ పారితోషికం కూడా డబుల్ అయ్యింది. ఇదే క్రమంలో బన్నీ ఒకపై కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేయాలని చూస్తున్నారని ప్రచారం మొదలైంది.

టాలీవుడ్ డైరెక్టర్లకు బన్నీ నో..
తెలుగు డైరెక్టర్లతో అల్లు అర్జున్ ఇన్నాళ్లు పని చేసి ఈ స్థాయికి వచ్చారు. త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటి వంటి ప్రముఖ డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. అయితే పుష్ప 2 తర్వాత నుంచి బన్నీ దర్శకుల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తోంది. కొత్త దర్శకులు, యంగ్ టాలెంట్ తో కలిసి పనిచేయాలని భావిస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణమూ ఉందని తెలుస్తోంది. ఇటీవల మలయాళ దర్శకుడు ఒకరు బన్నీ కలవడమే ఈ పుకారుకు కారణమని అంటున్నారు.
AA23 చిత్రానికి మలయాళ దర్శకుడు..
మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ డైరెక్టర్, యాక్టర్ బాసిల్ జోసెఫ్ ఇటీవల అల్లు అర్జున్ ను కలిశారంట. బన్నీతో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కలిశారని, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పారని, అందుకు బన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నారంటూ టాక్ నడుస్తోంది. బాసిల్ జోసెఫ్ ఇటీవల 'సూక్ష్మదర్శిని' చిత్రంలో హీరోగా నటించాడు. ఆయన దర్శకుడిగా మలయాళంలో కేవలం 3 చిత్రాలే విడుదలయ్యాయి. డైరెక్టర్ గా బన్నీని మ్యాచ్ చేసే క్రేజ్ కూడా లేదు. ఈ క్రమంలో ఈ రూమర్లు నిజమేనా అనే సందేహం కలుగుతోంది.
భారీ బడ్జెట్ తో AA22xA6..
AA22xA6 మూవీ షూటింగ్ ముంబైలోనే ప్రారంభమైంది. ముంబైలో జూన్ 10 నుంచే షూట్ ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పుదకొణె ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











