అల్లు అర్జున్‌కి అన్యాయం , అచ్చం ఎన్టీఆర్‌కు జరిగినట్లే .. బావబామ్మర్దులకే ఎందుకిలా?

2021 డిసెంబర్‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్ (పుష్ప 1). ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ క్రమంలో పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

తొలుత ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పుష్ప-2ని విడుదల చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. కానీ అనూహ్యంగా డిసెంబర్ 6కి సినిమాను వాయిదా వేయడంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ సినిమాను ఒక రోజు ముందుకు జరిపి అంటే డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తామని మరో ప్రకటన చేశారు మేకర్స్.
ఇంతటి భారీ హైప్ ఉన్న నేపథ్యంలో పుష్ప 2కు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Is Allu Arjun s Pushpa 2 event happening in Hyderabad or not

థియేట్రికల్ రైట్స్ కింద ఏకంగా రూ. 640 కోట్లు, డిజిటల్ రైట్స్‌ రూ. 275 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ.85 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 1065 కోట్ల వ్యాపారంతో పుష్పరాజ్ రికార్డుల దుమ్ముదులిపాడు. అలాగే పుష్ప 2ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11500 థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది.

ఇలాంటి భారీ హైప్ ఉన్న నేపథ్యంలో పుష్ప ప్రమోషనల్ కార్యక్రమాలు భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయగా.. ఈ కార్యక్రమం జరుగుతుందో లేదోనన్న అనుమానాలు నెలకొన్నాయి. హైదరాబాద్‌లో నెల రోజుల పాటు సభలు , సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలను పోలీసులు నిషేధించారు. నగరంలో అశాంతి రేకిత్తించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 28 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండటంతో పుష్ప -2 ఈవెంట్‌కి సంబంధించి అప్పటి వరకు ఎలాంటి అనుమతులు దక్కే అవకాశం లేదని ఫిలింనగర్ టాక్. ఈ వార్తలతో బన్నీ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.

Is Allu Arjun s Pushpa 2 event happening in Hyderabad or not

ఇదిలాఉండగా.. అల్లు అర్జున్‌కి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న రిలీజై ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చేయాలని నిర్మాతలు భావించారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ ఘటనతో ఎన్టీఆర్ కూడా ఎంతో బాధపడ్డారు.

సినిమా రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్మాతలు భావించారు. సరిగ్గా ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రులు జరుగుతుండటంతో భద్రతా కారణాలతో రెండు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్‌మీట్ లేకుండానే దేవర థియేట్రికల్ రన్ ముగియనుంది. ఇప్పుడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలోనూ ఇలాగే జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X