Pushpa 2 జగదీష్ అరెస్ట్‌తో కష్టాల్లో పుష్ప? కేశవ బెయిల్ కోసం భారీ ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో తెలుసా?
దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన పుష్ప చిత్రంలో కేశవ పాత్రతో ఆకట్టుకొన్న యాక్టర్ జగదీష్ ఇటీవల ఓ జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్ట్ కావడం సంచలనం రేపింది. అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న పుష్ప మూవీకి ఆయన అరెస్ట్ బ్రేక్ వేసింది అనే వార్తలు గుప్పుమంటున్నాయి. దాంతో ఈ సినిమా షూటింగ్‌పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఫుష్ప 2 మూవీ షూటింగ్ జరుగుతుందా? ఆగిపోతుందా? అనే రూమర్ల వివరాల్లోకి వెళితే..
యాక్టర్ జగదీష్‌కు జూనియర్ ఆర్టిస్ట్‌తో వివాహేతర సంబంధం ఉంది. అయితే కొద్ది నెలల క్రితం వారిద్దరూ విడిపోవడం, ఆ తర్వాత జగదీష్ మరో అమ్మాయిని వివాహం చేసుకొన్నట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే జగదీష్ వివాహం చేసుకోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ మరొకరితో రిలేషన్ పెట్టుకొన్నది.

అయితే కొద్ది రోజులుగా జూనియర్ ఆర్టిస్ట్ వ్యవహారంపై కన్నేసిన జగదీష్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఓ వ్యక్తితో ఉండగా ఆమెను అర్ధనగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్ మెయిల్ చేయడంతో జూనియర్ ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది.
జూనియర్ ఆర్టిస్టును ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై జగదీష్‌పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 306 ప్రకారం కేసు నమోదు చేసి ఆయనను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. దాంతో పుష్ప 2 సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయిందనే వార్త మీడియాలో వినిపిస్తున్నది.

అయితే పుష్ప 2 సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు జగదీష్ బెయిల్ కోసం యూనిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారనే విషయం ఆసక్తిని రేపింది. అయితే ఈ విషయంపై టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం. అయితే కొన్ని సన్నివేశాలను అల్లు అర్జున్‌పై చిత్రీకరించాల్సి ఉంది. ఆ సమయంలో జగదీష్ ఉండాల్సిన అవసరం లేదు యూనిట్ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.

పుష్ప 2 సినిమా జగదీష్ అరెస్ట్‌తో సమస్యలు లేవు. కానీ కొన్ని సన్నివేశాలను అల్లు అర్జున్‌తోపాటు జగదీష్‌తో చిత్రీకరించాల్సి ఉంది. అయితే జగదీష్ బయటకు వచ్చే సమయాన్ని బట్టి వాటిని చిత్రీకరిస్తాం అని తన యూనిట్ సభ్యులతో అన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications