సెన్సేషనల్ డైరెక్టర్, ఏఎం రత్నంతో పవన్ మూవీ.. సినీ వర్గాల్లో వైరల్‌గా
పాలిటిక్స్‌తో బిజీ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రంగానికి దూరమవ్వడం అభిమానులను కుంగదీస్తున్నది. అయితే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్ల నటిస్తారనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అయితే వాటిపై క్లారిటీ కనిపిచండం లేదు. అలాంటి రూమర్లలో తాజాగా ఒక వార్త మీడియాలో వైరల్ అయింది.
పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాకముందు పవన్ కల్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది. కానీ రాజకీయాలు, ఎన్నికల్లో తలమునకలైన కారణంగా సెట్స్‌లోకి వెళ్లలేకపోయింది. తాజాగా అదే ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

తాజా రిపోర్టు ప్రకారం ఇటీవల పవన్ కల్యాణ్‌ను ఏఎం రత్నం కలిసి తమ ప్రాజెక్ట్ గురించి సంప్రదించారట. క్రిష్ జగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేయమని రత్నం కోరినట్టు సమాచారం. అయితే తన రీఎంట్రీపై ఎలాంటి హామీని పవన్ కల్యాణ్ ఇవ్వలేదని స్పష్టంగా తెలుస్తున్నది.
ఒకవేళ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి మళ్లీ వస్తే ఫ్యాన్స్‌కు పండుగే. అయితే ఏఎం రత్నం సినిమా చేస్తారా? మైత్రీ మూవీస్ సినిమా చేస్తారా అనే విషయంపై స్పష్టత లేకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











