49 ఏళ్ల వయసులో అమీషా పటేల్ ప్రెగ్నెంట్.. పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా?
విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ వార్తలతో గత కొద్దిరోజులుగా బాలీవుడ్ షేక్ అవుతోంది. సాధారణంగా సెలబ్రెటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతుంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో చక్కర్లు కొడుతున్న ఓ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తల్లి అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
ఇటీవల హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతంలో ఫేడ్ అవుట్ అయిపోయే సమయంలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. దర్శక నిర్మాతల మైండ్‌సెట్ కూడా మారుతోంది.. పెళ్లి అయినా, పిల్లలు ఉన్నా హీరోయిన్లకు ఆఫర్లు ఇస్తున్నారు. నయనతార, కరీనా కపూర్, అలియా భట్, దీపిక పదుకొనె, కత్రినా కైఫ్, కియారా అద్వానీ వంటి భామలు పెళ్లి చేసుకున్నాక కూడా ఇండస్ట్రీని ఏలుతున్నారు. వివాహం తర్వాత కూడా కెరీర్ అద్భుతంగా కొనసాగించవచ్చని వీరంతా రుజువు చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మలు చూపిన బాటలో పలువురు తమ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

తన అందం, నటనతో టాలీవుడ్, బాలీవుడ్‌లను ఒక ఊపు ఊపారు అమీషా పటేల్. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన కహో నా ప్యార్ హై సినిమాతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమీషా.. తర్వాత పవన్ కళ్యాణ్ సరసన బద్రీలో నటించి తెలుగు వారిని పలకరించారు. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో నటించిన అమీషా పటేల్ హవా తర్వాత తగ్గింది. ఫేడ్ అవుట్ అనుకుంటున్న దశలో బాలీవుడ్ యాక్షన్ సూపర్‌స్టార్ సన్నీడియోల్ సరసన గదర్ 2తో అమీషా పేరు మారుమోగింది. ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లతో తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించారు అమీషా పటేల్.
గదర్ 2 తర్వాత మిస్టరీ ఆఫ్ ది టాటూ, టౌబా తేరా జల్వా సినిమాలలో అమీషా పటేల్ నటించారు. ఆ తర్వాత కొత్తగా ఏ చిత్రంలోనూ అమీషా కనిపించలేదు. తన వయసు, ఇమేజ్‌కు తగిన పాత్రల కోసం ఆమె వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అమీషా కథా చర్చల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ - రష్మికల వయసు తేడా ఇష్యూలో స్పందించిన అమీషా పటల్.. సల్మాన్‌కు బాసటగా నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అమీషా పటేల్ తాజాగా దుబాయ్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
బీచ్‌లో చిలుకపచ్చ రంగు బికినీ ధరించి, మ్యాంగో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ తింటూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అమీషాకు బేబీబంప్ ఉన్నట్లుగా పొట్ట భాగం లావుగా కనిపించడంతో నెటిజన్లు కామెంట్స్‌తో విరుచుకుపడుతున్నారు. 49 ఏళ్ల వయసులో పెళ్లికాకుండానే తల్లి ఎలా అయ్యారు? మిమ్మల్ని గర్భవతిని చేసిందెవరు? అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై అమీషా పటేల్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఈ ముదురుభామ నోరు విప్పితే తప్పించి ఈ పుకార్లకు చెక్ పడదు.


Click it and Unblock the Notifications











