ఆ డైరెక్టర్‌ను వదలని అనసూయ.. భారీ ప్రాజెక్ట్‌లో క్రేజీ ఆఫర్?

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఉన్నటువంటి చాలా మంది యాంకర్స్ లో అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారు ఉండరు. మరి అప్పుడు వరకు స్మాల్ స్క్రీన్ దగ్గర యాంకర్స్ అంటే ఒక ట్రెండ్ లో ఉంటే అందుకు కొంచెం గ్లామర్ ని యాడ్ చేసి అనసూయ ఒక దశాబ్దంన్నర కితం తెలుగు బుల్లితెరని ఒక ఊపు ఊపేసింది.

అంతకు ముందు కూడ పలు సినిమాలు చేసింది కానీ అనసూయ స్మాల్ స్క్రీన్ ఎంట్రీ తర్వాతే బిగ్ స్క్రీన్ పై సరైన అవకాశాలు ఆమె దక్కించుకుంది. కాగా తెలుగులో అనసూయ పలు సినిమాలు నటించింది కానీ వాటిలో ఆమెకి మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా యువ హీరో అడివి శేష్ తో నటించిన క్షణం సినిమా అయితే..

Is Anasuya Bharadwaj gets offer in Sukumar and Ram Charan s RC17

ఆ సినిమా నుంచి తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్రేక్ గా నిలిచిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన "రంగస్థలం" అని చెప్పవచ్చు. కాగా ఈ సినిమా ఇచ్చిన బ్రేక్ తో అనసూయ టాలీవుడ్ లో హాట్ కేక్ గా మరి అక్కడ నుంచి పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది.

ఆ సినిమా తర్వాత మళ్ళీ రంగస్థలం దర్శకుడు సుకుమార్ మళ్ళీ ఆమెకి గుర్తుండిపోయే రోల్ గా పాన్ ఇండియా సినిమా పుష్ప లో దాక్షాయణిగా చూపించారు. ఇలా వరుసగా సుకుమార్ కాంపౌండ్ నుంచే మొత్తం మూడు సినిమాలు అనసూయ చేయగా ఇపుడు మరో సినిమా రంగమ్మత్త చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈసారి సుకుమార్ సినిమాలో కాదు కానీ సుకుమార్ లాంటి సినిమాలు తీసే తన శిష్య దర్శకుడు బుచ్చిబాబు సాన సినిమాలో అనసూయ క్రేజీ ఆఫర్ పట్టేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇపుడు బుచ్చిబాబు సాన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Is Anasuya Bharadwaj gets offer in Sukumar and Ram Charan s RC17

కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ తో మరొక్కసారి అనసూయ స్క్రీన్ షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పలు సన్నివేశాలు కూడా షూటింగ్ జరిగాయి అని రంగస్థలం తరహాలోనే మంచి పాత్ర మళ్ళీ ఈ సినిమాతో ఆమెకి పడినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఇపుడు గుస గుసలు వినిపిస్తున్నాయి.

మరి ఇలా మొత్తానికి అయితే రంగమ్మత్తని సుకుమార్ కాంపౌండ్ వదలకుండా కంటిన్యూ చేస్తున్నారని చెప్పవచ్చు. మరి రంగస్థలంలో రామ్ చరణ్ తో అనసూయ సీన్స్ ఎలా పండాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇపుడు కూడా ఈ తరహా మ్యాజిక్ మళ్ళీ జరుగుతుందో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే మేకర్స్ ఈ ఏడాది రిలీజ్ కోసమే సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: anasuya sukumar pushpa 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X