అనసూయను తప్పించారా? తప్పుకొన్నారా?.. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి అవుట్!
రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తర్వాత యాంకర్, యాక్టర్ అనసూయ కెరీర్ గ్రాఫ్ రివ్వును దూసుకుపోతున్నది. రంగమ్మత్త పాత్రకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలే కాకుండా సినీ విమర్శకుల నుంచి మంచి స్పందనను ఆమె సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత సోలో హీరోయిన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ప్రస్తుతం ప్రధాన్యం ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే మీకు మాత్రమే చెప్తా చిత్రంలో ఓ కీలక పాత్రలో అనసూయ నటించింది. తాజాగా విడుదలై మంచి ఫలితాన్ని మీకు మాత్రమే చెప్తా అందుకొంటున్నది. కాగా అనసూయ ప్రమోషన్ కార్యక్రమంలో కనిపించకపోవడం చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..

అర్జున్ రెడ్డి సమయంలో
మీకు మాత్రమే చెప్తా చిత్రానికి ముందు అర్జున్ రెడ్డి విషయంలో విజయ్ దేవరకొండకు, అనసూయకు చిన్న వివాదం ఉండేది. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. లక్షలాది మంది అభిమానులు ఉన్న ఓ హీరో బూతు మాటను వేదికపైన ఎలా మాట్లాడుతారని చేసిన కామెంట్ కొంత వివాదం రేపింది.

విభేదాలను పక్కన పెట్టి
కాగా, అలాంటి విభేదాలు పక్కన పట్టి విజయ్ దేవరకొండ తాను నిర్మాతగా మారి నిర్మించిన మీకు మాత్రమే చెప్తాలో ఓ ప్రధాన పాత్రను ఆఫర్ చేశారు. సినిమాకు రిలీజ్‌కు ముందు చేసిన ప్రమోషన్స్‌లో అనసూయ తన మార్కు చూపించారు. అందరితోపాటు హుషారుగా ప్రచారం చేస్తూ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

డైరెక్టర్ సూచన మేరకే..
సినిమాకు ముందు ప్రమోషన్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అనసూయతో ఎలాంటి వివాదాలు లేవు. ఆమెను తీసుకోవడం వెనుక మాకు ఎలాంటి సంబంధం లేదు. డైరెక్టర్ అనసూయ అయితే ఆ పాత్రకు బాగుంటుందని అంటే.. ఆయన కోరిక మేరకు ఆమెను తీసుకొన్నాం. అది కూడా డైరెక్టర్ పర్యవేక్షణలోనే జరిగిందనే విషయాన్ని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.

ప్రమోషన్స్‌కు దూరం
అయితే సినిమా రిలీజ్ తర్వాత చేపట్టిన ప్రమోషన్ కార్యక్రమంలో అనసూయ కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు కూడా రాకపోవడంతో పలువురు ఆమె గైర్హాజరుపై ఆరా తీశారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రాలేదనే విషయం సినీ వర్గాల్లో వ్యక్తమైంది.

బిజీ కారణంగానే
రంగస్థలం తర్వాత కెరీర్ పరంగా.. టెలివిజన్ రంగంలో బిజీ కావడంతో ప్రమోషన్‌కు దూరంగా ఉందని సినిమా పీఆర్ వర్గాలు వెల్లడించాయి. పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పీఆర్‌వో స్పందించారు.


Click it and Unblock the Notifications











