Tripti Dimri యానిమల్ హీరోయిన్‌పై కన్నేసిన టాలీవుడ్ నిర్మాతలు.. తృప్తి డేట్స్ కోసం క్యూ లో ఎవరంటే?

యానిమల్ మూవీ రిలీజ్ తర్వాత వినోద పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిన పేరు తృప్తి డిమ్రి. ఈ సినిమాలో రష్మిక మందన్న తర్వాత సెకండ్ హీరోయిన్‌గా నటించిన ఈ అందాల భామ గ్లామర్ ప్రదర్శనకు అందరూ చిత్తైపోయారు. ప్రస్తుతం అన్ని భాషల నిర్మాత, దర్శకులు ఈ భామపై దృష్టిపెట్టారు. అయితే తృప్తి డిమ్రీ గురించి తెలుగు సినిమా రంగంలో హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. గ్లామర్ హీరోయిన్‌ను నటింపజేసేందుకు నిర్మాతలు భారీగా ప్రయత్నిస్తున్నారు. అయితే తృప్తి డిమ్రీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోయిన్ తృప్తి డిమ్రీ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో 1997 సంవత్సరంలో ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. 2017లో బాబీ డియోల్, బాబీ డియోల్, శ్రేయాస్ తల్పాడే నటించిన పోస్టర్ బాయ్స్ చిత్రంలో నటిచడం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశించింది. అదే సంవత్సరం శ్రీదేవీ నటించిన మామ్ అనే చిత్రంలో కూడా నటించి మెప్పించింది.

Is Animal Fame Tripti Dimri getting huge offers from Tollywood Producers? Here is details

ఇక తృప్తి డిమ్రీ నటించిన సినిమాల విషయానికి వస్తే.. 2018లో లైలా మజ్ను, 2020 సంవత్సరంలో బుల్‌బుల్, కాలా చిత్రాల్లో నటించింది. నాలుగైదు సంవత్సరాల్లో నటించిన సినిమాలు తక్కువైనా ఆమె తనదైన శైలిలో అందర్నీ ఆకర్షించింది. అయితే యానిమల్ సినిమా ఆమెకు తెచ్చిన పాపులారిటీ మరే సినిమా తీసుకురాలేకపోయింది.

తృప్తి డిమ్రీ ప్రొఫెషనల్‌గా ఆమె గ్రాఫ్ గొప్పగా లేకపోయినప్పటికీ.. మీడియాలో మాత్రం ఆమెకు మంచి గుర్తింపే లభించింది. ఫోర్డ్స్ ఆసియా అండర్ 30 విభాగంలో చోటు సంపాదించుకొన్నారు. అలాగే 2020 సంవత్సరంలో రెడీఫ్.కామ్ రూపొందించిన ప్రతిభావంతులైన యాక్టర్ల జాబితాలో 8వ స్థానం సొంతం చేసుకొన్నది. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో 20 స్థానం సంపాదించుకొన్నది.

Is Animal Fame Tripti Dimri getting huge offers from Tollywood Producers? Here is details

యానిమల్ సినిమా తర్వాత తృప్తి కెరీర్ గ్రాఫ్ రివ్వును దూసుకెళ్లేలా కనిపించింది. సెకండాఫ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో నటించిన సన్నివేశాలు కాక పెట్టించాయి. దాదాపు నగ్నంగా నటించిన ఈ భామ అందాలకు కుర్రకారు దాసోహం అయ్యారు. ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా గ్లామర్ బ్యూటీ పేరు మార్మోగుతున్నది.

ఇదిలా ఉండగా, తృప్తి డిమ్రీపై తెలుగు సినీ దర్శక, నిర్మాతల కన్నుపడింది. చాలా మంది తమ సినిమాల్లో నటింపజేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ప్రారంభమైన సినిమాల్లో తృప్తిని అడ్జస్ట్ చేసుకొనేలా స్క్రిప్టులు మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు బడా తెలుగు నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా స్పెషల్ సాంగ్స్ కోసం కూడా ట్రై చేస్తూ భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్దపడుతున్నారట.

Is Animal Fame Tripti Dimri getting huge offers from Tollywood Producers? Here is details

యానిమల్ సినిమాకు నాలుగైదు సినిమాల్లో నటించిన తృప్తి డిమ్రి ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నది. మేరే మెహబూబ్ మేరే సనమ్, వికీ వైద్య కా వో వాలా వీడియో సినిమాల్లో నటిస్తున్నది. యానిమల్ తర్వాత పలు ఆఫర్లు వచ్చినప్పటికీ.. ఆమె ఆచితూచి అడుగులేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X