twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ డైరెక్టర్‌తో అను ఇమ్మాన్యుయేల్ అఫైర్.. డేటింగ్ జోష్‌లో ఉన్న దర్శకుడు ఎవరంటే!

    |

    అందం, టాలెంట్ ఉన్నా అదృష్టం పలకరించలేని హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరంటే ఎలాంటి సందేహం లేదు. స్టార్ హీరోలతో జతకట్టిన ఈ హీరోయిన్‌కు అఫర్లు తక్కువే. ఆమె బ్యూటీ, టాలెంట్‌ను చూస్తే.. ఆమె దక్కిన ప్రతిఫలం తక్కువే అనిపిస్తుంది. కెరీర్‌లో తడబాటుకు గురవుతున్న అను ఇమ్మాన్యుయేల్ గురించి ఆసక్తికరమైన వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అను కెరీర్, ఆమె వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తల వివరాల్లోకి వెళితే...

    తెలుగు, తమిళంలో

    తెలుగు, తమిళంలో

    తెలుగులో ఆఫర్లతోపాటు దక్షిణాది ఇతర భాషల చిత్రాలపై అను ఇమ్మాన్యుయేల్ కన్నేసింది. మిస్కిన్, విశాల్ కాంబినేషన్‌లో వచ్చిన తుప్పరివాలన్ చిత్రంలోను, శివ కార్తికేయన్ నటించిన సూపర్ హిట్ చిత్రం నమ్మ వీటూ పిళ్లై చిత్రంలో నటించారు. పలు చిత్రాలు గురించి చర్చలు జరుపుతున్నారు.

    హాట్ టాపిక్‌గా అను ఇమ్మాన్యుయేల్ అఫైర్

    హాట్ టాపిక్‌గా అను ఇమ్మాన్యుయేల్ అఫైర్

    అను ఇమ్మాన్యుయేల్ కెరీర్‌తోపాటు అఫైర్‌ను కూడా కొనసాగిస్తున్నట్టు ఓ వార్త చెన్నై మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణతో అఫైర్‌లో ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై పూర్తిగా క్లారిటీ ఇవ్వడం లేదు.

    డైరెక్టర్ జ్యోతికృష్ణతో

    డైరెక్టర్ జ్యోతికృష్ణతో

    అయితే 23 ఏళ్ల అను ఇమ్మాన్యుయేల్.. 40 ఏళ్ల జ్యోతి కృష్ణతో డేటింగ్ చేయడం ఇప్పుడు తమిళ మీడియాలో చర్చనీయాంశమైంది. తన కంటే వయసులో 17 ఏళ్ల పెద్దవాడైన ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

    పూజా హెగ్డే హాట్ ఫోటో‌షూట్.. మీరెప్పుడూ చూడని ఫోటోలు వైరల్‌గా

    ఆక్సిజన్ సినిమా షూటింగులో

    ఆక్సిజన్ సినిమా షూటింగులో

    2017లో ఆక్సిజన్ అనే చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో గోపిచంద్‌తో కలిసి అను ఇమ్మాన్యుయేల్ నటించింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే. వారిద్దరూ ప్రొఫెషనల్ రిలేషన్‌ను కొనసాగిస్తున్నారనే విషయాన్ని ఇద్దరు సన్నిహితులు ప్రస్తావిస్తున్నట్టు సమాచారం.

    అను ఇమ్మాన్యుయేల్ కెరీర్

    అను ఇమ్మాన్యుయేల్ కెరీర్

    ఇండో అమెరికన్‌ అయిన అను ఇమ్మాన్యుయేల్ కెరీర్ విషయానికి వస్తే.. శైలజారెడ్డి మూవీతో తెలుగులో సక్సెస్‌ను, నమ్మ వీట్టూ పిల్లై సినిమాతో తమిళంలో విజయాన్ని అందుకొన్నారు. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో నటించారు. ప్రస్తుతం తెలుగులో మహా సముద్రం చిత్రంలో నటిస్తున్నారు.

    English summary
    Actress Anu Emmanuel career is going with high note. Apart from this, Report suggest that Anu Emmanuel is dating with director Jyothi Krishna. But no official confirmation in this regards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X