యువ హీరోతో అనుపమ పరమేశ్వరన్ పెళ్లి?

సినిమా ఇండస్ట్రీలో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గత దశాబ్ద కాలంగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఆమె అందంతోనే కాకుండా అభినయంతో సినీ విమర్శకులను మెప్పించడమే కాకుండా సాధారణ ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకొన్నారు. గ్లామర్ పాత్రలతోనే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్‌లో ఇంటెన్స్ పెరాఫెర్మాన్స్‌తో తన ప్రతిభను చూపిస్తున్నారు. అయితే గతంలో కూడా ఆమె లవ్ లైఫ్‌కు సంబంధించిన రూమార్లు వచ్చాయి. ప్రస్తుతం తమిళ సినిమాలో యువ హీరోతో చేస్తున్న డేటింగ్ వ్యవహారం పెళ్లి వరకు దారి తీసిందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. పెళ్లి వార్త నిజమేనా? డేటింగ్ ఎవరితో చేస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే..

సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు తప్పని విధంగా అనుపమ పరమేశ్వరన్‌ను కూడా డేటింగ్ రూమర్లు వెంటాడాయి. గతంలో క్రికెటర్ జస్మ్రిత్ బూమ్రాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఆఫైర్ గురించి బ్యూటీ క్వీన్ కూడా క్లారిటీ ఇచ్చేసింది. మా మధ్య స్నేహం మాత్రమే ఉంది. మా మధ్య అఫైర్ లేదు అని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో యువ హీరోతో అఫైర్ నడుస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త రూమర్‌ గానే మిగిలిపోయింది.

Anupama Parameswaran and Dhruv Vikram getting Married

అనుపమ ఇటీవల బైసన్ అనే తమిళ చిత్రంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగులో వారిద్దరి మధ్య సన్నిహిత బంధం పెరిగింది. వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మీడియాలోను, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోను గుప్పుమన్నాయి. అయితే వాటిపై ఇద్దరు కూడా స్పందించకపోవడంతో వారి రిలేషన్‌షిప్ గురించి అనేక అనుమానాలు, సందేహాలు పెరిగిపోయాయి.

అయితే ఇలాంటి డేటింగ్ రూమర్ల మద్య అనుపమ, ధ్రువ్ విక్రమ్ ఇద్దరు లిప్ లాక్ చేసుకొంటున్న ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ రేపింది. దాంతో వారిద్దరి మధ్య అఫైర్ నడుస్తుందనే వార్తకు బలం చేకూరింది. అయినా వారిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను చాటుమాటుగా కొనసాగిస్తూనే వస్తున్నారు. అయితే బైసన్ సినిమా తర్వాత వారిద్దరూ కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారనే వార్త ఆ ఇద్దరి బంధం నిజమే అనే వార్తకు మరింత బలం చేకూరింది.

ఇదిలా ఉండగా, డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్‌ను మించిన వార్త ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ గురించి చక్కర్లు కొడుతున్నది. ధ్రువ్‌తో పెళ్లి ఖాయమైంది. వారిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. దాంతో వచ్చే నెల అంటే మే మాసంలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే వార్త సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తున్నది. అయితే ఈ వార్త నిజమేనా? వారిద్దరి పెళ్లి చేసుకొంటున్నారా? అనే విషయం కొద్ది రోజులు ఆగితే తేటతెల్లం అవుతుంది.

అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే.. 2025 సంవత్సరం జోష్‌గానే సాగింది. డ్రాగన్, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, పరదా, కిష్కిందపురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ చిత్రాల్లో నటించింది. 2026లో ఆమె నటించిన లాక్ డౌన్ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం ఆమె చేయబోయే సినిమాలు ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాకపోవడంతో పెళ్లి కారణంగానే అంగీకరించడం లేదా? అనేది చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X