ప్రభాస్ కు హ్యాడ్ ఇచ్చిన అనుష్క...
అరుంధతి చిత్రంతో తెలుగులో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయిన బెంగుళూరు భామ అనుష్క ' రెబల్" చిత్రం నుంచి తప్పుకొని ప్రభాస్ కు టాటా చెప్పేసిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులు క్రితం రాఘవలాన్స్ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాతగా ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇందులో ప్రభాస్ కు జోడీగా అనుష్క, దీక్షాసేథ్ లను కథానాయికలుగా ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు రాఘవలాన్స్. ఇప్పటి వరకు జరిగిన ఈ సినిమా షూటింగ్ అనుష్క పాత్ర ప్రవేశించకుండానే జరుగుతోంది.
అయితే అనుష్క 'రెబల్" షూటింగ్‌లో పాల్గొనకుండా తప్పుకొందన్న వార్త ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కాగా తెలుగులో నాగార్జునతో 'డమరుకం" చిత్రంతో బిజీగా వున్న అనుష్క ఈ చిత్రంతోపాటు 'బాణం" దర్శకుడు చైతన్యదంతులూరి రూపొందించనున్న 'రంపచోడవరం" చిత్రంలోనూ, అలాగే త్వరలో 'ఆవారా"ఫేమ్ కార్తీ కథానాయకుడిగా సూరజ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందనున్న ఓ చివూతంలోనూ నటించడానికి అంగీకరించింది. అనుష్క 'రెబల్" చిత్రం నుంచి తప్పుకోవడానికి కారణం ఆమెకు డేట్స్ కుదరకపోవడమేనా... లేక మరేదైనా కారణం వుందో చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











