twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడాకులు పొందిన డైరెక్టర్‌తో అనుష్కశెట్టి పెళ్లి.. జోరందుకొన్న హాట్ న్యూస్

    |

    లాక్‌డౌన్‌ సమయంలో టాలీవుడ్‌లో పెళ్లి వార్తలు జోరు అందుకోవడంతో తెలుగు సినీ పరిశ్రమలో సంతోషకరమైన వాతావరణం కనిపిస్తున్నది. హీరో నిఖిల్ పెళ్లి తర్వాత రానా దగ్గుబాటి, నిహారిక కొణిదెల పెళ్లి వార్తలు మరింత జోష్‌ను పెంచాయి. ఈ వార్తల నేపథ్యంలో అనుష్క పెళ్లి వార్త మరోసారి మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మళ్లీ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారనే పాత వార్తనే బలంగా ప్రచారం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..

    పదేళ్లలో అనుష్క జీవితంపై

    పదేళ్లలో అనుష్క జీవితంపై

    గత పదేళ్లలో అనుష్క వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వచ్చిన గాసిప్స్ మరో హీరోయిన్‌పై ఉంచి ఉండకపోవచ్చు. గోపిచంద్‌తో మొదలు పెడితే.. నాగచైతన్య, ప్రభాస్, ఓ డైరెక్టర్, నిర్మాతగా మారిన పారిశ్రామిక వేత్తతో పెళ్లి అంటూ వార్తలు మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇలాంటి వార్తలపై పెద్దగా ఎవరూ పటించుకోకపోవడంతో పెద్దగా చర్చ జరగలేదు.

    ప్రభాస్‌తో లింక్ పెట్టి

    ప్రభాస్‌తో లింక్ పెట్టి

    ఇక బాహుబలి తర్వాత అనుష్క పెళ్లి వార్తల జోరు ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ప్రభాస్, అనుష్క మధ్య ఉన్న సన్నిహిత బంధాలను ఆసరాగా చేసుకొని పెళ్లి చేసుకొంటున్నారనే విషయంపై గాసిప్స్ వచ్చాయి. ఆ తర్వాత తమ మధ్య అలాంటి బంధం లేదనే విషయాన్ని స్పష్టం చేయడంతో కొంతకాలంగా ప్రభాస్‌తో పెళ్లి వార్తలకు బ్రేక్ పడింది.

    లాక్‌డౌన్‌లో పెళ్లిపై ధ్యాస

    లాక్‌డౌన్‌లో పెళ్లిపై ధ్యాస

    ఇక లాక్‌డౌన్ సమయంలో షూటింగులు వాయిదా పడటం పలువరు బ్యాచ్‌లర్స్ ఒంటరి జీవితాన్ని అనుభవించి రావడంతో పెళ్లిపై ధ్యాస పెరిగిందనే వాదన మొదలైంది. ఆ క్రమంలోనే రానా, మిహిక పెళ్లి కూడా సెట్ జరిగిందనే విషయం తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్ సమయంలో జరిగిన పలు చర్చల తర్వాత అనుష్క పెళ్లి ఓ విడాకులు పొందిన డైరెక్టర్‌తో జరుగబోతున్నదనే వార్త హైలెట్ అయింది.

    ప్రముఖ దర్శకుడి కుమారుడితో

    ప్రముఖ దర్శకుడి కుమారుడితో

    గతంలో తాను పనిచేసిన ఓ చిత్రానికి సంబంధించిన డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. ప్రముఖ డైరెక్టర్ కుమారుడైన ఆయన ప్రస్తుతం భార్యతో విడాకులు తీసుకొని ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు ఆ డైరెక్టర్‌ను వివాహం చేసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు వార్తలు మళ్లీ ఊపందుకొన్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందనే విషయం ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు స్పందిస్తే ఇలాంటి వార్తలకు బ్రేక్ పడే అవకాశం ఉంది.

    English summary
    Tollywood Star Actress Anushka Shetty marriage news on viral in the media. Reports suggest that sweety is decided to marry a popular director son, Who is divoreced from the wife.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X