కెవ్వుకేక భామ రెండో పెళ్లి.. ప్రియుడితో మలైకా హంగామా!
బాలీవుడ్‌లో పెళ్లి కళ ఉట్టిపడుతున్నది. అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ పెళ్లి కాగానే.. అదే దారిలో రణ్‌వీర్-దీపికా, ప్రియాంకా, నిక్ జోన్స్‌లు రెడీ అయ్యారు. దీపికా, రణ్‌వీర్ పెళ్లి నవంబర్‌లో, ప్రియాంక పెళ్లి డిసెంబర్‌లో జరుగునున్న సంగతి తెలిసిందే. అయితే వీరు కాకుండా మరో జంట కూడా వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. వారెవరో కాదు.. కెవ్వు కేక ఆంటి మలైకా అరోరా, బోని కపూర్ కుమారుడు, హీరో అర్జున్ కపూర్ జంట. వీరిద్దరూ కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మ్యారేజ్ గురించి సంకేతాలు
కొద్దిరోజులుగా మీడియాకు మలైకా అరోరా, అర్జున్ కపూర్ తమ డేటింగ్, పెళ్లి వ్యవహారంపై సంకేతాలు వదులుతున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో హడావిడి చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఈవెంట్లు, పార్టీలకు ఈ ప్రేమ జంట సాక్ష్యంగా నిలుస్తున్నారు.

పార్టీలు, ఈవెంట్లలో జంట జోరు
మలైకా, అర్జున్ కలిసి ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీలకు విందు ఏర్పాటు చేయగా దానికి కరణ్ జోహర్ తదితరులు హాజరయ్యారు. అప్పుడే కరణ్ జోహర్ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్తను వదిలారు. దాంతో మీడియాలో పెద్ద చర్చ జరిగింది.

ఇప్పటికే విడాకులతో ఒంటరిగా
మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి అనగానే కనుబొమ్మలు ముడుచుకొన్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను మలైకా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకొన్న విషయం తెలిసిందే. అర్బాజ్, మలైకాకు పిల్లలు కూడా ఉన్నారు. విడాకులు పొందినప్పటి నుంచి మలైకా ఒంటరిగానే ఉంటుంది.

ఏప్రిల్‌లో వివాహం
ఇలాంటి నేపథ్యంలో మలైకా అరోరా, అర్జున్ కపూర్ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒక్కటవుతున్నారనే వార్త బాలీవుడ్ మీడియాలో బలంగా వినిపిస్తున్నది. అయితే బోనీ కపూర్ ఫ్యామిలీ అందుకు ఒప్పుకుంటుందా? ఎలాంటి ట్విస్టులు, టర్నింగ్‌లు లేకుండా పెళ్లి జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











