అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో.. ఇండియాస్ బిగ్గెస్ట్ కాంబినేషన్ సెట్ చేసిన అట్లీ?
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఒక భాష ఇండస్ట్రీ మరో భాష ఇండస్ట్రీ అని ఏమీ లేదు. నాచురల్ స్టార్ నాని చెప్పినట్టుగా అన్ని సినిమాలు ఒకటే ఇప్పుడు ఇండియన్ సినిమా అన్నట్టుగా అన్నిభాషలు సినిమాలు అన్ని సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఒకరితో ఒకరు వర్క్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. అలా ఇండియన్ సినిమా దగ్గర క్రేజీ ప్రాజెక్ట్ లు ఒక ఊహించని కాంబినేషన్ లు వస్తుండగా మూవీ లవర్స్ కి రాను రాను బిగ్ ఫీస్ట్ వస్తుంది.
అలా ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇండియన్ సినిమా దగ్గర క్రేజీ పాన్ ఇండియా సినిమాలు భారీ మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తుండగా ఈ సినిమాల్లో ఇప్పుడు ఓ సెన్సేషనల్ కలయిక కోసం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తక్కువ సినిమాలతోనే తమిళ యంగ్ దర్శకుడు అట్లీ భారీ స్టార్డం తెచ్చుకున్నాడు.

అటు దళపతి విజయ్ తో రెండు బిగ్ హిట్స్ కొట్టి డైరెక్ట్ బాలీవుడ్ వెళ్ళాడు. అక్కడ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో చేసిన "జవాన్" సినిమాతో ఏకంగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్నాడు. ఇక నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడు ఎవరితో చేస్తాడు అనే అంశాలు వైరల్ గా మారగా లిస్ట్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ వచ్చింది కానీ ఇది కొన్ని మూలాన ఆగిపోయింది అని రూమర్స్ వచ్చాయి.
కాగా ఇప్పుడు మరో షాకింగ్ టాక్ అయితే ఇండస్ట్రీ వర్గాలను ఊపేస్తోంది. ఆ సినిమా ఆగితే ఆగితే ఆగింది కానీ నెక్స్ట్ అట్లీ బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్ లతో భారీ మల్టీ స్టారర్ ని సెట్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ నటుడు గానే కాకుండా నిర్మాతగా కూడా చేస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

మరి ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే ఇండియన్ సినిమా దగ్గర మాములు రికార్డ్స్ నమోదు అవ్వవు అని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. సో ఈ కాంబినేషన్ ఉందో లేదో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.. కాగా ఇప్పుడు సల్మాన్ ఖాన్ మరో తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో "సికందర్" అనే సినిమా చేస్తుండగా రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ తో "కూలీ" అలాగే దర్శకుడు జ్ఞ్యానవెల్ తో "వేట్టైయన్" అనే రెండు సినిమాలు చేస్తున్నారు.
అలాగే దీని తర్వాత తన కెరీర్ లో రీసెంట్ భారీ హిట్ అయ్యిన చిత్రం "జైలర్" సినిమాకి సీక్వెల్ "జైలర్ 2" కూడా చేయనున్నారు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి. దీనిని నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాతోనే రజినీకాంత్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. కానీ దీని తర్వాత వచ్చిన "లాల్ సలాం" తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది.


Click it and Unblock the Notifications











