డ్యూయల్ రోల్‌తో రచ్చ.. షారుఖ్ ఖాన్‌తో అట్లీ భారీ ప్లాన్
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ ఫాం కోల్పోయి చాలా ఏళ్లు అవుతోంది. ఆ మధ్య వచ్చిన చెన్నై ఎక్స్‌ప్రెస్ తప్పా మరో హిట్ కొట్టలేకపోయాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా డిజాస్టర్ల నుంచి బయటకు రాలేకపోయాడు. ఇక సినిమాలు వద్దు అనే స్టేజ్ వరకు షారుఖ్ ఖాన్ వెళ్లిపోయాడు. అందుకే ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ మరో సినిమాను ప్రకటించలేకపోయాడు. చివరగా జీరో సినిమాతో అందరినీ మెప్పించాలని వచ్చాడు.
2018లో వచ్చిన జీరో సినిమా డిజాస్టర్ అయింది. అలా ప్రతీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ఇంత వరకు హీరోగా మరో ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. అయితే నిర్మాతగా మాత్రం తన రెడ్ చిల్లీస్ మీద సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అవి కూడా అంతగా వర్కవుట్ అవ్వడం లేదు. అయితే కొన్ని రోజులుగా షారుఖ్ ఖాన్ సినిమాపై అనేక రూమర్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్‌తో షారుఖ్ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ సినిమా ఫిక్స్ అయింది. ఇందులో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఎన్‌ఐఏ అధికారి, మరొకటి గ్యాంగ్ స్టర్. ఈ రెండు పాత్రల్లో షారుఖ్ కనిపించబోతోన్నట్టు టాక్. అయితే వీటిపై మాత్రం ఇంకా అధికారిక సమాచారం రాలేదు. త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











