అల్లు అర్జున్‌తో 5 గురు హీరోయిన్లు.. ఆ ముద్దుగుమ్మలు ఎవరంటే?
పుష్ప 2 సెన్సేషనల్ హిట్ తర్వాత అల్లు అర్జున్, అలాగే జవాన్ మూవీ తర్వాత అట్లీ కుమార్ కలిసి చేస్తున్న ప్రాజెక్టు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా కోసం పుష్ప 2 తర్వాత జవాన్ లాంటి హిట్ కొట్టిన అట్లీతో అల్లు అర్జున్ చేతులు కలిపారనే విషయం మీడియాలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి మరింత హంగామా సృష్టించారు. హాలీవుడ్ స్థాయిలో 1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు రోజు రోజుకు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ల గురించిన అంశాలు క్రేజీగా మారాయి. ఈ సినిమా విశేషాల వివరాల్లోకి వెళితే..
అట్లీ రూపొందించిన జవాన్ సినిమా, అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను రాబట్టింది. జవాన్ చిత్రం ఇండియాలో 770 కోట్లు, విదేశాల్లో 400 కోట్లతో మొత్తంగా 1170 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం 1857 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇలా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ కలిసి ప్రాజెక్టు చేయడం, ఆ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించడం ఆసక్తిని రేపుతున్నది.

అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక క్రేజీగా సాగుతున్నది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫిట్‌నెస్, బాడీ బిల్డింగ్‌పై దృష్టిపెట్టారు. ఈ మేరకు హాలీవుడ్ నుంచి ట్రైనర్‌ను సిద్దం చేశారు. ఇక అల్లు అర్జున్ లుక్ మూడు, నాలుగు రకాలుగా ఉంటుంది. ఆయన క్యారెక్టర్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయనే విషయం మీడియాలో ప్రచారం అవుతున్నది.
ఇక అల్లు అర్జున్ పక్కన నటించేందుకు సుమారుగా 5 హీరోయిన్లను ఎంపిక చేసినట్టు తెలుస్తున్నది. ఈ సినిమాలో ఆయనతో దీపిక పదుకోన్, జాన్వీ కపూర్, మృణాల్ థాకూర్ నటిస్తున్నారు. వీరి ఎంపిక ఇప్పటికే ఫైనల్ అయిపోయింది అని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇక నాలుగో హీరోయిన్ కోసం లేటేస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ భోర్సేతో చర్చలు జరుపుతున్నారు. ఆమె ఎంపిక కూడా దాదాపు ఖరారు అయినట్టే అని చెబుతున్నారు.
ఇక ఐదో హీరోయిన్ ఎంపిక కూడా పరిశీలనలో ఉంది. మరో టాప్ హీరోయిన్‌తో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ ఐదుగురు హీరోయిన్ల పేర్లు కూడా అధికారికంగా ప్రకటిస్తారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రను మలయాళ హీరోయిన్ నజ్రియా నజీం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అభిమానుల్లో రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications











