»   » ధూమ్-4: ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్!

ధూమ్-4: ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పటి వరకు దక్షిణాదికి... ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి' సినిమాతో అమాంతం జాతీయ స్థాయి హీరోగా మారిపోయాడు. బాహుబలి ముందు వరకు ప్రభాస్ సినిమా రావడం లేటవుతుందని కాస్త డిసప్పాయింటుగా కనిపించిన అభిమానులు బాహుబలి విడుదల వ్వడం, భారీ విజయం సాధించడంతో పాటు తమ హీరో స్థాయి కూడా పెరగడంతో చాలా ఆనందంగా ఉన్నారు.

బాహుబలి తర్వాత ప్రభాస్ చుట్టూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు పోటీ పడుతున్నారని, ఆయన త్వరలో ధూమ్-4లో నటించే అవకాశం ఉందనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పాటు కరణ్ జోహార్ కూడా ప్రభాస్ తో భారీ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.


Is 'Baahubali' star Prabhas the new baddie in 'Dhoom 4'?

ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి-2 సినిమా షూటింగుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 2015న మొదలు కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది చివరకల్లా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవి తప్ప ప్రభాస్ ఇప్పటి వరకు ఏ ఇతర ప్రాజెక్టులు కూడా అఫీషియల్ గా కమిట్ కాలేదు.


బాహుబలి పార్ట్ 2 కూడా భారీ విజయం సాధిస్తే ప్రభాస్ ఇక ప్రాంతీయ స్థాయిలో కాకుండా.... జాతీయ స్థాయిలో సినిమాలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ దేహ దారుఢ్యం, సూపర్బ్ లుక్స్, దక్షిణాదిలో ఫాలోయింగ్, బాహుబలి తర్వాత బాలీవుడ్లోనూ ఫాలోయింగ్, వీటన్నింటికీ మించి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ప్రభాస్ ప్లస్ పాయింట్స్. ప్రభాస్ ధూమ్-4 మూవీకి పర్ ఫెక్టుగా సెట్ అవుతాడని అంటున్నారు.

English summary
After the release of Baahubali, Telugu star Prabhas has caught the eye of Bollywood biggies. Rumour has it, Prabhas will make his Bollywood debut alongside Hrithik Roshan in Yash Raj Film's franchise Dhoom 4.
Please Wait while comments are loading...