పెళ్లి పీటలు ఎక్కనున్న బేబీ బ్యూటీ?.. వైష్ణవి చైతన్య గురించి హింట్ ఇచ్చిన యువ హీరో!

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ వైష్ణవి చైతన్య. చిన్న చిన్న షార్ట్స్ ఫిల్మ్స్ చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టింది వైష్ణవి. ఆ తరువాత స్టార్ హీరోలకు చెల్లెలుగా కనిపించి మెప్పించింది. ఇక ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఆమెను ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ను చేసింది. అదే బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు SKN నిర్మాతగా వ్యవహరించాడు.

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇద్దరు కుర్రాళ్లను మోసం చేసిన అమ్మాయిగా ఆమె నటన ఎంతోమంది ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత వైష్ణవి వరుస అవకాశాలను అందుకుంది.

Is Baby Movie Heroine Vaishnavi Chaitanya getting Marriage soon Here is the Details

దిల్ రాజ్ బ్యానర్ లో ఆశిష్ హీరోగా తెరకెక్కిన లవ్ మీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది కానీ.. వైష్ణవికి మంచి మార్కులే పడ్డాయి. ఇక లవ్ మీ సినిమా రిలీజ్ అయ్యి పదిరోజులు కూడా కాకముందే .. ఓటిటీ లో ప్రత్యక్షమవ్వడానికి రెడీ అయ్యింది. లవ్ మీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ 15 నుంచి లేదా 22 నుంచే ఈ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

ఇక కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ కాకపోయినా ఓటిటీలో హిట్ అవుతాయి. అందుకే ఈ ఓటిటీ కోసం కూడా చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే లవ్ మీ టీమ్ సుమ అడ్డాలో సందడి చేశారు. ఇందులో సుమ.. చిత్ర బృందంతో ఒక ఆట ఆడేసుకుంది. అందరిపై సుమ పంచ్ లు వేస్తే.. ఈ ప్రోమో లో సుమపై వైష్ణవి పంచ్ వేసి షాక్ ఇచ్చింది. రాత్రిపూటనే దెయ్యాలు ఎందుకు తిరుగుతాయి అని సుమ అనగానే.. వైష్ణవి తడుముకోకుండా పొద్దునంతా షోస్ చేస్తున్నాయి అని సుమను ఉద్దేశించి చెప్పుకొచ్చింది. దీంతో సుమ కూడా షాక్ అయ్యింది.

Is Baby Movie Heroine Vaishnavi Chaitanya getting Marriage soon Here is the Details

ఇక ఈ ప్రోమోలో వైష్ణవి గురించిన ఒక విషయాన్నీ ఆశిష్ బయటపెట్టాడు. త్వరలోనే వైష్ణవి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ హింట్ ఇచ్చాడు. దీంతో ఆ గుడ్ న్యూస్ పై అభిమానులు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నారు. చాలామంది.. వైష్ణవికి పెళ్లి కుదిరిందని, త్వరలోనే ఈ భామ పెళ్లి పీటలు ఎక్కనుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇంకొంతమంది మాత్రం.. ఇప్పుడే కదా అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే పెళ్లి చేసుకుంటే.. ఇక అవకాశాలు రావడం కష్టమేమో అని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం వైష్ణవి చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సిద్దు జొన్నలగడ్డ సరసన నటిస్తోంది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X