ఎన్టీఆర్ పాత సినిమా కథే... రాజమౌళి 'బాహుబలి' ?

By Srikanya

హైదరాబాద్: రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చెక్కుతున్న శిల్పం... బాహుబలి కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై ట్రేడ్ లో ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్,అనుష్క పుట్టిన రోజులను పరస్కరించుకుని విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ఇప్పటికే అందరిలో అమితమైన ఆసక్తిని రేపటంలో సఫలీకృతమయ్యాయి. ఈ నేఫద్యంలో ఈ చిత్రం ఎన్టీఆర్ పాత చిత్రం మర్మ యోగి నుంచి కాపీ కొట్టారంటూ ప్రచారం మొదలైంది. ఆ చిత్రం కథను తీసుకుని కొద్దిపాటి మార్పులు,చేర్పులతో ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఓ ఇంగ్లీష్ దినపత్రిక కథనాన్ని సైతం ప్రచురించింది.

తమిళంలో కె.రామనాథ్ దర్శకత్వంలో 1951లో 'మర్మయోగి' పేరుతో హిందీలో ''ఏక్‌కా రాజా'' పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో 1964లో నిర్మించారు. తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్ చేసిన ఈ చిత్రం రెండు చోట్లా మంచి విజయం సాధించింది. మర్మయోగి కథ విషయానికి వస్తే... ఓ నర్తకి వ్యామోహంలో పడ్డ మహారాజు...ఆమె కుట్రతో రాజ్యాధికారం కోల్పోతోడు. ఆమె అతన్ని నదిలో తోసి అడ్డుతొలిగించుకుంటుంది. అయితే అక్కడి తప్పించుకున్న ఆ రాజు మారు వేషంలో యేగిగా మారి అదే రాజ్యంలో తిరుగుతూంటాడు. ఆ తర్వాత కాలంలో ఆ రాజుకు పుట్టిన యువరాజు ఆ దేశాన్ని నిరంకుసంగా ఏలుతున్న ఆమెపై తిరుగుబాటు చేసి తన తండ్రిని తిరిగి సింహాసనంపై కూర్చో బెడతాడు. అతనికి సోదరుడు కూడా సాయించేస్తాడు.

Is Bahubali a Copy of NTR's 'Marmayogi

రమ్యకృష్ణ నెగిటివ్ రోల్ లో బాహుబలి చిత్రంలో కనపించనుంది. అన్నదమ్ములుగా రానా, ప్రభాస్ కనిపిస్తారు. రాజ్యంకోసం జరిగే కుట్రలతో ఈ చిత్రం సాగుతుంది.మరో ప్రక్క ఈ చిత్రం గురించి వినిపిస్తున్న వూహాగానాలు అన్నీ ఇన్నీ కావు. కొబ్బరికాయ కొట్టకముందే బోలెడన్ని కబుర్లు వినిపించాయి. సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇంతకీ ఆ సినిమాలో ఏముంది? ఎప్పుడొస్తుంది? అసలు ఇప్పుడేం జరుగుతోంది? ఇంతకీ ఎలా ఉంటుంది ఆ సినిమా? ప్రభాస్‌ ఎలా కనిపిస్తాడు? ఎంత డబ్బుతో తీస్తున్నారు? ఇలా ఒకటేమిటి? ఒకరేమిటి? ఇతర చిత్ర పరిశ్రమలు కూడా మన 'బాహుబలి' గురించి ఆరాతీస్తున్నాయి. ఈ సినిమా గురించి ఎంత గోప్యంగా ఉంచుతూంటే అంత ఆసక్తి రేపుతోంది.

ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క జంటగా నటిస్తున్నారు. రానా కీలక పాత్రధారి. ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది. రీసెంట్ గా కేరళలో ప్రభాస్‌ పాల్గొన్న పోరాట సన్నివేశాన్ని చిత్రించారు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. రాజమౌళి కరెక్టుగా ఈగ విడుదలైన రోజు (సంవత్సరం క్రితం)న ఈ చిత్రం ఓపినింగ్ పెట్టుకున్నారు. షూటింగ్ కు ముందు నుంచి ఈ చిత్రం రోజుకో వార్తతో రికార్డు క్రియోట్ చేస్తోంది. ప్రభాస్ గెటప్ దగ్గరనుంచి ఈ చిత్రంలో ప్రతీదీ సంచలనమే. ఐమాక్స్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. యారీ ఎలెక్సా ఎక్స్‌.టి. కెమెరాని వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు కేరళ, తమిళనాడు, రాజస్థాన్‌లలో చిత్రీకరణ జరుగుతుంది.

మరో ప్రక్క 'బాహుబలి' సినిమా కోసమే అన్నట్టుగా ప్రభాస్‌ కూడా ఓ వార్మప్‌ మ్యాచ్‌ ఆడాడు. అదే... 'మిర్చి'. ఇందులో ఆయన కత్తి పట్టి ప్రతినాయకులతో చెడుగుడు ఆడాడు. సూటూబూటూ ధరించి అమ్మాయిల మనసులతోనూ ఆడుకొన్నాడు. మ్యాచ్‌కి ముందు వార్మప్‌ అని ఒకటుంటుంది. సమరానికి సన్నద్ధమవ్వడంలాంటిదన్నమాట. అందులో ఆటగాళ్ల జోరుని చూసి తదుపరి మ్యాచ్‌ ఫలితంపై ఓ అంచనాకి వస్తుంటాం అలాగే బాహుబలిపై మిర్చి మరింత అంచనాలు పెంచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X