శ్రీరామ రాజ్యం స్పూర్తితోనే నయన మత మార్పిడి..!?
నయనతార మతం మార్చుకుని హిందువుగా మారడంలో ప్రభుదేవా ప్రోద్బలం ఉందనేది అంతా నమ్ముతున్న మాట అయితే తాను మతం మార్చుకోవడానికి పెళ్లి పరమైన కారణాలు లేవని నయనతార స్పష్టం చేసింది. నటిగా పెళ్లికి ముందు చేసిన ఆఖరి సినిమా శ్రీరామరాజ్యంలో సీత పాత్ర పోషించిన నయనతార ఆ పాత్రని రక్తి కట్టించేందుకు అహర్నిశలు నియమ నిష్టలు పాటించింది. నటిగా ఆత్మసంతృప్తి లభించడంతో చివరి రోజున సెట్స్ పై కన్నీరు కూడా పెట్టుకుందన్న విషయం తెలిసిందే.
ఈపాత్ర పోషణ వల్లనే నయనతారకి హిందుత్వంపై మోజు పుట్టిందట. దానికి తోడు శ్రీరాముడిగా నటించిన బాలకృష్ణ కూడా హిందూ మత గొప్పతనాన్ని, పురాణాలని నయనతారకి పూసగుచ్చినట్టు చెప్పాడట. దాంతో బాగా ఇన్ ఫ్లుయెన్స్ కి గురయిన నయనతార ఈ నిర్ణయం తీసుకుందట.


Click it and Unblock the Notifications











