జూ ఎన్టీఆర్ శక్తి ప్లాప్ తో బాలయ్య డైలమాలో...
'శక్తి'తో నిరాశచెందిన జూ ఎన్టీఆర్ భారీ బడ్జెట్ సినిమాలంటేనే కంగారు పడ్తోన్న జూ ఎన్టీఆర్, ఇరవైకోట్ల రూపాయల లోపే సినిమా పూర్తయ్యేలా సబ్జెక్ట్స్ తయారు చేసుకోమని దర్శక నిర్మాతలకి సూచిస్తున్నాడట. ఇందులో వాస్తవమెంతోగానీ, టాలీవుడ్ లో హీరోలు, దర్శక నిర్మాతలు బడ్జెట్ కంట్రోల్ విషయమై శ్రద్దపెడితే మంచి విషయమే. గొప్పసబ్జెక్ట్..అంటూ టాలీవుడ్ బిజినెస్ రేంజ్ దాటిపోయే బడ్జెట్ పెట్టేసుకుని సినిమాలు రూపొందించేయడం, అవి కాస్తా బాక్సాఫీస్ వద్ద ఫట్ మంటే నిర్మాతలు దిమ్మదిరగడం టాలీవుడ్ ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయాయి.
'మగధీర" సినిమాని చూసి 'ఆరెంజ్", 'పులి", 'శక్తి", 'ఖలేజా" సినిమాలు ఎలా వాత పెట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడో వచ్చే ఒక్క హిట్టు కోసం పది డిజాస్టర్స్ చవిచూడ్డం కన్నా..జాగ్రత్తల్లో ఉండి, సేఫ్ బడ్జెట్ లోపల సినిమా తీసుకుంటే ఇటు హీరో..అటు నిర్మాత..అన్నిటికీ మించి టాలీవుడ్ బాగుపడుతుంది.
ఇదిలా వుండగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన శక్తి చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశలో వున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ పై ఎంతో నమ్మకం పెట్టి చిత్రం చేసినా..ఎన్టీఆర్ కు సినిమా సరైన ఫలితం ఇవ్వలేదని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. కాగా సరైన సక్సెస్ ఒక్కటి లేకపోయినా వరుసగా సినిమాలు చేస్తున్నమెహర్ రమేష్ తో తను ఓ చిత్రం చేయబోతున్నానని నటిసింహా బాలకృష్ణ గతంలో స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు శక్తి ఫలితం పాజిటివ్ గా లేకపోవడంతో..బాలయ్య డైలమాలో పడ్డాడని సమాచారం. దాదాపు మెహర్ తో చిత్రం చేయాలనే ఆలోచనను తను విరమించుకున్నట్టుగా తెలిసింది..


Click it and Unblock the Notifications











