ఆఫర్లు లేని హీరోయిన్‌కు ఛాన్స్ ఇచ్చిన బాలకృష్ణ.. NBK109 కోసం హాట్ అందాల భామ!
సినీ పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా వారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ సక్సెస్ కాలేరు. పొరపాటుగా హిట్ వచ్చినప్పటికీ మళ్ళీ రెండో ఛాన్స్ వరుస అవకాశాలు ఎందుకో కొందరికి రావు. ఇది యువ హీరోలు హీరోయిన్స్ కి కూడా బాగా వర్తిస్తుంది. మరి అలాంటి హీరోయిన్ కోసమే ఇప్పుడు చెప్పుకునేది.
టాలీవుడ్ లో మంచి సినిమాలు పడినప్పటికీ ఇంకా మంచి బ్రేక్ సినిమా ఈమెకి కావాలి అన్నట్టుగా ఉంది నటి ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి. కెరీర్ స్టార్టింగ్ లోనే మంచి సినిమాలు ఈమెకి పడ్డాయి. మెగా హీరో వరుణ్ తేజ్ తో కంచె ఆ తర్వాత కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా చేసింది. కానీ ఇప్పటికీ టాలీవుడ్ లో అంత అవకాశాలు లేవు. బహుశా అయితే చివరి సరిగా ఆమె కెరీర్ లో అందుకున్న భారీ హిట్ ఏదన్నా ఉంది అంటే అది నటసింహ నందమూరి బాలకృష్ణతో చేసిన చిత్రం "అఖండ" అనే చెప్పాలి.

దర్శకుడు బోయపాటి శ్రీను కూడా తన "జయ జానకి నాయక" తర్వాత రెండో ఛాన్స్ గా "అఖండ" కి ఇచ్చారు. సరే అఖండ తర్వాత మళ్ళీ ప్రగ్యా జైస్వాల్ ఖాళీగానే ఉంది. మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ అదే బాలయ్య తన సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టుగా ఇపుడు దాదాపు ఖరారు అయ్యింది. కాగా ఇప్పుడు బాలయ్య తన 109వ సినిమాని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా బయట పెట్టలేదు కానీ ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పోస్ట్ ఒకటి ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఆమె కర్నూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నట్టుగా తెల్పింది. ఇప్పుడు అయితే అక్కడ షూటింగ్ జరుపుకుంటున్న సినిమా బాలయ్య సినిమా ఒక్కటే ఉంది. సో ఈ రకంగా ప్రగ్యా అయితే ఈ సినిమాలో ఉన్నట్టు ఖరారు అయ్యిందని ఇప్పుడు బజ్.

అయితే ఇది ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా నటిస్తుండగా యానిమల్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నాగవంశీ, త్రివిక్రమ్ లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండగా దాదాపు ఈ ఏడాది రిలీజ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతానికి చేస్తున్నారు. లేదా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేలా ప్రణాళికలు వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











