కాకినాడ సెజ్ లో బాలయ్య?

By Staff

ప్రముఖ సిని నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా కాకినాడ సెజ్ వద్ద పెట్టుబడి పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. ఐతే వాటిని అధికారికంగా ప్రకటించటానికి బాలయ్య ఇష్టం లేదని అంటూన్నారు. ఐతే డైరెక్ట్ గానే తన పేరు తోనే పెట్టుబడి పెడతారని సరైన సమయం లో పెట్టుబడి వివరాలు ప్రకటించే అవకాసం ఉందని అంటున్నారు.ఇక కాకినాడ బాలయ్య అత్తవారి ఊరు కాబట్టి అక్కడ పెట్టటానికి ముందుకొచ్చారని మరి కొందరు అనటం జరుగుతొంది. ఇక సెజ్ లో పెట్టుబడి పెట్టటం అనేది రాజకీయ లబ్ది కోసమా లేక వ్యాపారం గాన అనేదే మాత్రం తేలటం లేదని ఫిలిం నగర్ వార్త. అవన్నీ ఇలా ఉంటె ఈ వార్త నిజామా లేక రూమర్ అనేది మాత్రం తేలకుంది.

ఇక బాలయ్య ప్రస్తుతం భీష్మ అనే చిత్రం కమిట్ అయ్యారు. రైడ్ చిత్రంతో నిలదొక్కుకున్న రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తాడని తెలుస్తోంది. రమేష్ వర్మ చెప్పిన స్టోరీ లైన్ బాలకృష్ణకు బాగా నచ్చటంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఈ సినిమాతో రమేష్ వర్మ పెద్ద డైరక్టర్ల జాబితాలో చేరుతాడని ఫిల్మ్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు. పోస్టర్స్ డిజైనర్ గా పాపులర్ అయిన రమేష్ వర్మ ఒక ఊరిలో సినిమాతో డైరక్టర్ గా తెరంగ్రేటం చేసాడు.అనంతరం సముద్ర దర్శకత్వంలో వచ్చిన మల్లెపూవు చిత్రానికి కథ అందించాడు. ప్పుడు రైడ్ చిత్రంతో పెద్ద హీరోల దృష్టిలో పడ్డాడు. గతంలో బెల్లంకొండ..బాలకృష్ణ కాంబినేషన్లో లక్ష్మీ నరసింహ వంటి హిట్స్ వచ్చాయి. ఐదేళ్ళ క్రిందట జరిగిన కాల్పుల ఉదంతం తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాలేదు. మొన్న రైడ్ ఆడియో పంక్షన్ కి బాలయ్య వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అనంతరం బాలయ్య పుట్టిన రోజుని బెల్లంకొండ గ్రాండ్ గా జరిపి అందరినీ ఆనందపరిచాడు. ఇప్పడు మళ్ళీ భీష్మతో అభిమానులను అలరిస్తాడని అంటున్నారు. వరస ఫ్లాప్ ల తో ఉన్న బాలయ్య కి సైతం హిట్ కావలిసిన సమయమిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X