ఇంతకీ బాలయ్య మార్చుతాడంటారా

పార్టీ ప్రచారంలో ఇన్నాళ్లూ బిజీగా తిరిగిన బాలకృష్ణ మళ్లీ తిరిగి తన సినీ జీవితంలోకి జూన్ 1 నుంచి రానున్నారు. ఆ రోజు నుంచి తన కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొత్త దర్శకుడు సత్యదేవా డైరక్షన్ లో ఓ చిత్రం చేయబోతున్నారు. స్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించబోతున్నారు. ఈ చిత్రం మే 9 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. జూన్ 1 నుంచి షూటింగ్ షెడ్యూల్ ఖరారు చేసారు. ఆ రోజు నుంచి ఆయన ముఖానికి మేకప్ వేసుకుని విజృంభించనున్నారు.
గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ తో ఈ చిత్రం రెడీ అవుతోందని సమాచారం. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు త్వరలోనే తెలియజేస్తాము''అని నిర్మాతలు తెలిపారు.


Click it and Unblock the Notifications











