మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య వారసుడు ఆ ఇద్దరికీ డేంజరేనా?
దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో కూడా నెపోటిజం అనే పదాన్ని చాలా మంది తరుచుగా వింటూ ఉంటారు. ఒక స్టార్ హీరో లేదా హీరోయిన్ నుంచి వారు వారసులు సినిమాల్లోకి రావడం అలా వచ్చే డోస్ ఎక్కువైతే అప్పుడు గట్టిగా నెపోటిజం అనే టాక్ వినిపిస్తుంది. కాగా ఇది లేని ఇండస్ట్రీ ఎక్కడా లేదు, కానీ ఈ నెపోటిజం గెపోటిజం అనే మాటలని మాత్రం వారి హీరోలని ఆరాధించే అభిమానులు ససేమిరా పట్టించుకోరు.
టాలెంట్ ఉంటేనే కదా వాళ్ళైనా కూడా సర్వైవ్ అయ్యేది.. అయినా టాలెంట్ లేకపోతె ఎంత స్టార్ హీరో కొడుకైనా కమెడియన్ గానే మిగిలిపోతాడు అంటారు. అలా సినిమాలో ఇప్పుడు సీనియర్ హీరోల కొడుకులు మనవళ్లు, కూతుళ్లు ఇలా చాలా మంది పరిచయం అవుతూనే వస్తున్నారు. ఇలా తెలుగులో లేటెస్ట్ గా అనౌన్స్ అయ్యిన స్టార్ హీరో కొడుకు "నందమూరి తారక మోక్షజ్ఞ్య తేజ".

మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ కొడుకుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లాంచ్ ని తెలుగులో అయితే ఇస్తున్నట్టుగా తన బర్త్ డే కానుకగా అనౌన్స్ చేసేసారు. కాగా ఇక్కడ నుంచే అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. ఎంత నందమూరి కుటుంబం నుంచి చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ వారి కుటుంబంలో ఎప్పుడూ కొన్ని కలహాలు మాత్రం ఉన్నాయని ఇప్పటికీ టాక్ వినిపిస్తూ ఉంటుంది.
ఇలా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే బాలయ్య అభిమానులు నడుమ సోషల్ మీడియాలో కానీ అటు ఆఫ్ లైన్ లో కానీ గొడవలు జరిగిన సందర్భాలు కోకొల్లలు.. ఇది పక్కన పెడితే మోక్షజ్ఞ్య ఎంట్రీకి జూనియర్ ఎన్టీఆర్ అలాగే తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ లు కూడా తమ శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు వీరి ఎరా నడుస్తుంది.

కానీ మోక్షజ్ఞ్య ఎంట్రీకి కూడా తక్కువ అంచనాలు ఏమీ లేదు. సరైన వారసుడు వస్తే నందమూరి వంశాన్ని అతడే టేకోవర్ చేస్తాడు అంటూ వారి అభిమానుల్లోనే ఓ టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇలా ఇప్పుడు మోక్షజ్ఞ్య ఎంట్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణ్ రామ్ ల ఉనికికి ఎప్పటికైనా డేంజరే అన్నట్టుగా ఆల్రెడీ టాక్ మొదలైంది. ప్రస్తుతం మార్కెట్ పరంగా ఎన్టీఆర్ నందమూరి వంశంలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.
మరి రానున్న రోజుల్లో మోక్షజ్ఞ్య ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చేవాడిగా మారుతాడా? నందమూరి అభిమానులు ఎలా తమ సపోర్ట్ ని ఈ హీరోలకి అందిస్తారు అనేవి రసవత్తరంగా మారాయి. ఇంకోపక్క ఇన్ని రోజులు లేనిది మోక్షజ్ఞ్య పేరులో కూడా తారక అని చేర్చడం కూడా ఇతర హీరోల అభిమానుల్లో చర్చకు దారి తీసింది. వీటితో మోక్షజ్ఞ్య ఎంట్రీ నిజంగానే తారక్, కళ్యాణ్ రామ్ ల ఉనికికి దెబ్బ కొడుతుందా లేదా అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. కాగా మోక్షజ్ఞ్య హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో గ్రాండ్ ఎంట్రీని అది కూడా సినిమాటిక్ యూనివర్స్ లో ప్లాన్ చేసుకున్నాడు దీనితో తన మొదటి సినిమా మీదే భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











