కుర్ర హీరోతో భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ అఫైర్.. అప్పటి నుంచే ఆ రిలేషన్?
ఇపుడు తెలుగు సినిమాలో కొత్త హీరోయిన్స్ ధాటి అంతకంతకు ఎక్కువ అవుతూ వస్తుంది అని చెప్పవచ్చు. ఇలా గడిచిన నాలుగేళ్ల లోనే చాలా మంది కొత్త బ్యూటీస్ తెలుగు సహా ఇతర భాషల నుంచి వచ్చేసారు. ఇంతేనా ఇంకొందరు అయితే తమ ఎంట్రీ ప్లాప్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మంచి ఆఫర్స్ తో కొనసాగుతున్నారు. మరి ఇలా తెలుగు సినిమాలో మంచి ఆదరణతో కొనసాగుతున్న యువ హీరోయిన్స్ లో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల టాప్ లో కొనసాగుతుంది.
ఇక తనతో పాటుగా గత ఏడాది తన మొదటి సినిమాకే యువకుల హృదయాలు కొల్లగొట్టిన యువ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే కూడా ఒకామె అని చెప్పవచ్చు. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ తో తెలుగు సినిమా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. కాగా ఇంత ప్లాప్ అయినప్పటికీ కూడా ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ ఆమె అందుకుంది.

అయితే ఇపుడు యువ హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. కానీ ఈ సినిమా చేస్తున్న చేస్తున్న సమయంలోనే రామ్ మరియు భాగ్యశ్రీలు డేటింగ్ లో ఉన్నట్టుగా పలు పుకార్లు యిట్టె మొదలయ్యాయి. కానీ ఇపుడు గాసిప్స్ మాత్రం భాగ్యశ్రీ సీక్రెట్ రిలేషన్ షిప్ లో మరో హీరోతో ఉన్నట్టుగా వినిపిస్తున్నాయి.
కాగా ఈ హీరో కూడా ఇపుడు శ్రీలీలతో చేస్తున్న బాలీవుడ్ హీరో అన్నట్టుగా టాక్. మరి ఆ హీరో ఎవరో కూడా కాదు కార్తీక్ ఆర్యన్ అట. ఒకప్పుడు కేవలం వేలలో రెమ్యునరేషన్ అందుకున్న ఈ హీరో ఇపుడు 50 కోట్ల మేరకి చేరుకున్నాడు. మెయిన్ గా మన తెలుగు హిట్ అల వైకుంఠపురములో సినిమాని హిందీలో రీమేక్ చేసినవాడిగా అందరికీ బాగా తెలిసి ఉండొచ్చు.
కాగా ఈ హీరోతోనే భాగ్యశ్రీ కొన్నాళ్ల నుంచి రిలేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుందో. కాగా భాగ్యశ్రీతో ఈ యువ హీరో స్పోర్ట్స్ చిత్రం చందూ ఛాంపియన్ చేయడం జరిగింది. మరి ఈ సినిమా నుంచే ఇద్దరూ కూడా డేటింగ్ లో ఉన్నట్టుగా టాక్. కాగా గత 2024లో సినిమా రిలీజ్ కి రాగ అంతకు ముందే షూటింగ్ నుంచే వీరి పరిచయం రిలేషన్ షిప్ లోకి వెళ్లినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇపుడు రామ్ తో ఆమె డేట్ లో ఉందని చాలా మంది అనుకుంటున్నారు కానీ ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. కాగా ఇపుడు కార్తీక్ ఆర్యన్ శ్రీలీలతో ఒక రొమాంటిక్ మ్యూజికల్ సినిమాలో నటిస్తుండగా శ్రీలీల తెలుగులో ఈ సినిమా తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. పలు సినిమాలు హిందీలో ఆగిన తర్వాత ఈమె చేసిన సినిమా ఇది కాగా దీనిపైనే శ్రీలీల అన్ని ఆశలు పెట్టుకుంది.


Click it and Unblock the Notifications











