Devara: దేవర 2లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో? ఆ సస్పెన్స్ రోల్ కోసమేనా? రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేశాడంటే?
ఎప్పుడు నుంచో హాలీవుడ్ లాంటి ఇండస్ట్రీస్ లో సీక్వెల్ సినిమాలు ఉన్నాయి కానీ ఈ ట్రెండ్ మన ఇండియన్ సినిమా దగ్గర ఊపందుకోవడానికి మాత్రం కొంచెం సమయం పట్టింది. అయితే ఇండియన్ సినిమా దగ్గర బాహుబలి సిరీస్ కంటే సీక్వెల్స్ లేవా అంటే ఉన్నాయి కానీ బాహుబలి తర్వాతే సీక్వెల్ సినిమాలు అంటే భారతదేశ సినీ ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.
కాగా ఇక్కడ నుంచి సీక్వెల్ సినిమాలు ప్రతీ సినిమా ఇండస్ట్రీ నుంచి కామన్ గా మారిపోయాయి. ఇలా ఈ సీక్వెల్స్ పర్వం మన తెలుగు సినిమా నుంచి భారీ చిత్రం "దేవర" వరకు వచ్చింది. కాగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో చేసిన ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ భారీ హిట్ అయ్యి అదరగొట్టింది. మరి ఈ సినిమాలో కూడా బాహుబలి 1 తరహాలోనే క్రేజీ ట్విస్ట్ క్లైమాక్స్ లో పెట్టారు.

అయితే బాహుబలి తరహాలోనే దేవర కి కూడా పార్ట్ 2 కోసం అందరిలో చర్చ మొదలైంది. పార్ట్ 2 లో చాలా ప్రశ్నలే ఉన్నాయి. అలాగే వాటికి కొరటాల ఎలాంటి సమాధానాలు సిద్ధం చేసుకున్నారు అనేది కూడా ఇంకా ఆసక్తి రేపుతోంది. సరే ఇదిలా ఉండగా దేవర క్లైమాక్స్ పై ఓ క్రేజీ టాక్ ఇపుడు వినిపిస్తుంది. కాగా దేవర క్లైమాక్స్ లో మరో విలన్ ఎంట్రీ ఉండాల్సి ఉందట.
అంటే పుష్ప క్లైమాక్స్ లో భన్వర్ సింగ్ షెకావత్ తరహాలో.. కానీ దానిని పార్ట్ 2 కి మార్చేశారని ఇప్పుడు తెలుస్తుంది. మరి ఆ విలన్ రోల్ కి అనుకున్న నటుడు వేరెవరో కూడా కాదు అనిమల్ సినిమాలో అదరగొట్టి ఇపుడు టాలీవుడ్ లో బిజీగా మారుతున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ అట. కాగా ఈ సినిమాలో విలన్ రోల్ కోసం బాబీ డియోల్ భారీ రెమ్యునరేషన్ ని అడిగినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా దేవర 2 కోసం బాబీ ఏకంగా 8 కోట్ల రెమ్యునరేషన్ ని అడిగాడట. దీనితో ఇలా పార్ట్ 2 కి లాక్ చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి పార్ట్ 1 లో ఆల్రెడీ పవర్ఫుల్ విలన్ భైర గా సైఫ్ అలీఖాన్ ఉన్నాడు. మరి పార్ట్ 2 లో అంతకి మించిన విలన్ రోల్ కూడా ఉందట. దేవర సినిమాలో గమనిస్తే "యెతి" అనే పాత్రతో సినిమా మొదలవుతుంది.
అసలు ఆ యెతి ఎవరు అనేది పెద్ద సస్పెన్స్ గా కొరటాల పార్ట్ 2 కోసం దాచి ఉంచాడు. కాగా ఈ రోల్ అనేది పార్ట్ 2 లో నెగిటివ్ షేడ్ లోనే కనిపిస్తుంది అని ఇపుడు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. దీనితో ఆ సస్పెన్స్ రోల్ లోనే బాబీ డియోల్ కనిపించే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇలా మొత్తంగా మాత్రం కొరటాల ఊహించని ప్లానింగ్ నే చేసినట్టుగా ఇప్పుడు అనిపిస్తుంది. మరి పార్ట్ 1 సక్సెస్ అయితే పార్ట్ 2 లో ఇలాంటి అనేక ఇతర ఆసక్తికర ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











