గర్భం దాల్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్? నవరాత్రి వేడుకల్లో బేబీ బంప్ దాస్తూ

దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మీడియాలో ఎక్కువగా వినిపించిన పేర్లు రియా చక్రవర్తి, అంకితా లోఖండే. వీరితో ఆయన కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించారు. కానీ తర్వాత ఎవరి దారులు వారివి అయ్యాయి. వీరిలో అంకితా లోఖండేతో సుశాంత్ అనుబంధం ప్రత్యకమైనది. ఇద్దరూ సీరియల్స్‌లో కలిసి పనిచేసిన సమయంలో ప్రేమలో పడ్డారు. అయితే సుశాంత్ హీరో కావడంతో ఇద్దరూ విడిపోయారని బాలీవుడ్ టాక్. తాజాగా అంకితా లోఖండేపై ఓ వార్త మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఒకసారి చూస్తే :

హిందీ సీరియల్స్‌ను ఫాలో అయ్యే వారికి పవిత్ర రిష్తా పేరు చెప్పగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఖచ్చితంగా గుర్తొస్తారు. ఈ ధారావాహికలో మావన్‌గా సుశాంత్.. అర్చనగా అంకితల నటనకు బుల్లితెర ఆడియన్స్ ఫిదా అయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ ద్వారా భారతదేశంలోని గడగడపకు వారిద్దరూ దగ్గరయ్యారు. ఈ సీరియల్‌కు సీక్వెల్‌గా పవిత్ర రిష్తా 2ని బాలాజీ టెలి ఫిల్మ్స్ తెరకెక్కించగా సుశాంత్ పాత్రలో షాహీర్‌ను ఎంపిక చేశారు. అయితే మానవ్‌గా సుశాంత్‌ను తప్పించి మరొకరని ఊహించలేకపోతున్నామని అభిమానులు పేర్కొన్నారంటే సుశాంత్ నటనను అర్ధం చేసుకోవచ్చు.

Is Bollywood Actress and Bigg boss contestant Ankita Lokhande Hiding Baby Bump

సుశాంత్‌ మరణంతో అంకిత షాక్‌కు గురయ్యారు. మొన్నామధ్య ఓ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ.. సుశాంత్‌‌ను తాను ఎంతో ఇష్టపడ్డానని.. కొందరి చెప్పుడు మాటల వల్లే అతను తనతో విడిపోయాడని ఆరోపించారు. సుశాంత్ నిర్ణయంతో రాత్రికి రాత్రే తన జీవితంలో పరిస్ధితులు మారిపోయాయని , కానీ అతని నిర్ణయాన్ని గౌరవించాలని అనుకున్నట్లుగా అంకిత అన్నారు. సుశాంత్‌తో విడిపోయాక మరొకరి జీవితంలోకి వెళ్లడానికి తాను భయపడ్డానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుశాంత్‌తో విడిపోయిన తర్వాత విక్కీ జైన్‌తో ప్రేమలో పడ్డారు అంకిత. 2021 డిసెంబర్ 14న ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో వీరి వివాహంగా అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు వీరి వివాహానికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. తర్వాత భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అంకిత. ఈ క్రమంలో గతేడాది ఆమెకు పెద్ద షాక్ తగిలింది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే అనారోగ్యంతో కన్నుమూశారు. తండ్రి మరణంతో షాక్‌కు గురైన అంకిత.. అంత్యక్రియల సందర్భంగా స్వయంగా పాడె మోశారు.

భర్తతో కలిసి గతేడాది టెలికాస్ట్ అయిన బిగ్‌బాస్ హిందీ 17 సీజన్‌లో భర్త విక్కీ జైన్‌తో కలిసి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు అంకిత. సీజన్ మధ్యలో తనకు ఏదో తప్పు జరిగినట్లుగా అనిపిస్తోందని.. పీరియడ్స్ రావడం లేదని ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నట్లు బాంబు పేల్చింది అంకిత. బిగ్‌బాస్ నిర్వాహకులు చేసిన టెస్టులో ఆమెకు నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. తాజాగా మరోసారి అంకిత ప్రెగ్నెన్సీకి సంబంధించి ఓ న్యూస్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.

గత రాత్రి నవరాత్రి వేడుకల్లో భాగంగా భర్త విక్కీజైన్‌తో కలిసి పాల్గొన్న ఆమె తన బేబీ బంప్‌ను దాచడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అంకిత తన బొడ్డు ప్రాంతాన్ని గులాబీ రంగు చీరతో కవర్ చేసినట్లు కనిపించింది. ఇది చూసినవారు అంకిత ప్రెగ్నెంటా అని పోస్టులు పెడుతున్నారు. దీనిపై అంకిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: ankita lokhande vicky jain
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X