ఆ స్టార్ హీరోయిన్ గర్భవతా? పెళ్లయిన నాలుగు నెలలకే!
బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రఘ్న సిన్హా కుమార్తె, స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ ఏడాది జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం ముంబైలో జరిగింది. ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. వరుసపెట్టి ఫారిన్ ట్రిప్‌లు వేస్తూ జోష్‌లో ఉంది. సోనాక్షి కూడా ఆల్రెడీ కమిటైన ప్రాజెక్ట్స్‌ని ఫినిష్ చేసి భర్తతో ఎక్కువ సమయం గడిపేందుకే ప్రాధాన్యతనిస్తోంది.
సోనాక్షి- ఇక్బాల్‌లు 2022లో డబుల్ ఎక్స్ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా బీ టౌన్ మీడియా కోడై కూసింది. అయితే అంతకు ఐదేళ్ల ముందు నుంచే వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ మొదలై డేటింగ్ వరకు వెళ్లిందని బాలీవుడ్ టాక్. సోనాక్షి హిందూ అమ్మాయి కాగా.. ఇక్బాల్ ముస్లిం. వీరిద్దరూ ప్రేమలో పడినప్పుడు చాలా మంది పెదవి విరిచారు కూడా. స్వయంగా సోనాక్షి తల్లి, సోదరుడు ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి.

అయితే శత్రుఘ్న సిన్హా మాత్రం కూతురి పెళ్లికి హాజరయ్యారని చెబుతారు. మరోవైపు జహీర్‌ను పెళ్లిచేసుకున్నాక సోనాక్షి .. ఇస్లాం మతంలోకి మారుతారంటూ నేటికీ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. అయితే ఈ వార్తలను అప్పట్లోనే జహీర్ తండ్రి ఇక్బాల్ రతాన్సీ ఖండించారు. సోనాక్షి మతం మారరని తేల్చిచెప్పారు. తాను మానవత్వాన్ని మాత్రమే నమ్ముతానని.. హిందువులు భగవాన్ అన్నా, ముస్లింలు అల్లా అన్నా మనమంతా మనుషులమని రతాన్సీ పేర్కొన్నారు.
కాగా.. జహీర్‌తో పెళ్లి తర్వాత సోనాక్షి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా ప్రచారం జరిగింది. ముంబైలోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో సోనాక్షికి చెందిన లగ్జరీ ఫ్లట్ అమ్మకానికి పెట్టినట్లుగా వార్తలు వచ్చాయి. సీ ఫేసింగ్‌లో ఉండే ఈ ఫ్లాట్ ధర రూ. 25 కోట్ల పై మాటేనని చెబుతారు. ఈ సంగతి పక్కనబెడితే.. కొత్తగా పెళ్లయిన వారు శుభవార్త ఎప్పుడు చెబుతారా అని వధూవరుల కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తుంటారు. సోనాక్షి విషయంలోనూ ఇదే జరిగింది.

ఇరు కుటుంబాల పెద్దలు శుభవార్త కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్లయి నాలుగు నెలలు కూడా కాలేదు, అప్పుడే అంత తొందరేంటి అనేవాళ్లు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో సోనాక్షి సిన్హా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా ముంబైలోని జరిగిన దివాళీ బాష్‌లో అనార్కలీ సూట్ ధరించారు సొనాక్షి. భర్తతో కలిసి తమ పెట్ డాగ్‌ను ముద్దాడుతూ కనిపించారు. అయితే ఈ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపిస్తుండటంతో పాటు పొట్ట భాగం ముందుకొచ్చినట్లుగా ఉంది. సోనాక్షి గర్భం దాల్చారని, త్వరలోనే గుడ్‌న్యూస్ చెబుతారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీపై ఇప్పటి వరకు సోనాక్షి దంపతులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ గాసిప్స్ నేపథ్యంలో సోనాక్షి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











