Pushpa 2: ఐటెమ్ సాంగ్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ.. బన్నీ- సుక్కుల ప్లాన్ మామూలుగా లేదుగా!

Pushpa Item Song: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కని పుష్ప పార్ట్ -1 ఏ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఇది ఒకటి. ఇందులో అల్లు అర్జున్ నటనకు తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. మునుపెన్నడూ కనిపించని విధంగా పుష్పలో ఊరమాస్‌గా కనిపించి తెగ ఆకట్టుకున్నాడు. ఇక ఈ క్రేజీ మూవీలో లో ఐటెం సాంగ్ అంటే.. పూనకాలే.. ఇక రచ్చ రంబోలనే.. తాజాగా పుష్ప 2.. ద రూల్ సినిమాలోని ఐటమ్ సాంగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఎర్ర చందనం, స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటించింది. శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా నటించి.. మరోసారి తన సత్తా చాటింది. అల్లు అర్జున్ ప్రేయసిగా జనాల్ని ఆకట్టుకుంది. అదిరిపోయే స్టెప్పులతో ఇగరదీసింది. అందం, అభినయంతో నెటిజన్లను ఆకట్టుకుంది.అల్లు అర్జున్ అద్భుతమైన నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా హంగామా చేశారు.

Is Bollywood heroine Tripti Dimri doing special song in allu arjun s pushpa 2

ఇక పుష్ప కు సీక్వెల్ గా పుష్ప-2 వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్స్ వదిలారు. గంగమ్మ జాతర గెటప్ లో అల్లు అర్జున్ నిమ్మకాయ దండలు మెడలో వేసుకుని, చీర కట్టుకున్న గెటప్ తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫ్యాన్స్ సంబరాలకైతే లిమిట్స్ లేకుండా పోయాయి. కానీ పుష్ప రెండో భాగం వాయిదాలతో షూటింగ్ నడుస్తోంది. నాలుగు రోజులు షూటింగ్ అయితే.. మరో రెండు నెలలు ఏదో ఒక కారణం చేత పోస్ట్ పోన్ అవుతుంది. ఫ్యాన్స్ ఏమో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరీ అదేంటో కాదు.. పుష్ప 2 సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి ప్రత్యేక చర్చ సాగుతోంది. పుష్ప పార్ట్ 1 లో స్టార్ హీరోయిన్ సమంత తో హాట్ స్టెప్స్ వేయించి
ప్రేక్షకులని విపరీతంగా అలరించాయి సుకుమార్. ఈ సాంగ్ కు క్రేజీ రెస్పాన్స్ రావడంతో పుష్ప 2 లో కూడా సుకుమార్ అంతకు మించి అనేలా ఒక మాస్ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే చాలామంది స్టార్ అండ్ హాట్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కానీ ఇప్పటికీ ఆ ఐటెం బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు.

Is Bollywood heroine Tripti Dimri doing special song in allu arjun s pushpa 2

గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. కానీ ఆ బ్యూటీ కాకుండా.. ఓ బాలీవుడ్ బ్యూటీ పుష్పలో మెరవనుందట. మరీ ఈ వార్తలు ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ.. ఈ న్యూస్ యువత చెవిన పడగానే ఎగిరి గంతులేస్తున్నారు. గతంలో బాలీవుడ్ నటి దిశా పటానీని తీసుకోనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. తర్వాత యానిమల్ లో బోల్డ్ గా కనిపించి యూత్ మనసును కొల్లగొట్టిన త్రిప్తి డిమ్రి అని అనుకున్నారు. అనంతరం రీసెంట్ గా తెరకెక్కిన దేవర చిత్రంలో అద్భుతంగా నటించిన జాన్వీ కపూర్ సాంగ్ లో ఐటెం సాంగ్ లో మెరవనుందని నెట్టింట గట్టి టాక్ వినిపించింది.

ప్రస్తుతం వీరందర్ని మించి ఓ హీరోయిన్ ను దింపబోతున్నారట దర్శక, నిర్మాతలు. మరీ ఈ బ్యూటీ ఎవరో కాదు.. శ్రద్ధా కపూర్. ఇండస్ట్రీ నుంచి వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. పుష్ప-2 లో ఐటెమ్ సాంగ్ స్టెప్పులేసేందుకు ఈ బోల్డ్ బ్యూటీ అయితేనే బాగుందని సుకుమార్ భావిస్తున్నారట. ఇది కనుక నిజమైతే థియేటర్ బద్దలవ్వాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పుష్ప పార్ట్-2 డిసెంబరు 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X