బిచానా సర్దేసిన ‘బొమ్మ అదిరింది’.. నాగబాబు అక్కడ.. మరి చమ్మక్ చంద్ర ఎక్కడ?

బుల్లితెరపై ఓ షోను రన్ చేయడం అంటే మామూలు విషయం ఏమీ కాదు. జబర్దస్త్ గత ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా సాగిందంటే అది చాలా గ్రేట్. జబర్దస్త్ షోకు పోటీగా అదిరింది షోను బాగానే గ్రాండ్‌గా లాంచ్ చేశారు. కానీ చివరకు దాన్ని కొనసాగించుకోలేకపోయింది. చివరకు మళ్లీ ఏదో మార్పులు చేసి బొమ్మ అదిరిందిగా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో ఇది కూడా బాగానే క్లిక్ అయింది. కానీ చివరకు మళ్లీ చేతులెత్తేసినట్టు కనిపిస్తోంది.

నాగబాబుతో అలా..

నాగబాబుతో అలా..


జబర్దస్త్ షో నుంచి నితిన్ భరత్ బయటకు రావడం, వారి కోసం నాగబాబు జబర్దస్త్‌ను వీడటం అందరికీ తెలిసిందే. జబర్దస్త్‌కు ధీటుగా మరో కామెడీ షోను ప్లాన్ చేసే సత్తా వారికి ఉందని నమ్మిన నాగబాబు వారికి అండగా నిలబడ్డాడు. నాగబాబు కోసం కొందరు జబర్దస్త్ కమెడియన్లు కూడా బయటకు వచ్చారు. అందులో ముఖ్యంగా చమ్మక్ చంద్ర ఉన్నాడు.

అదిరింది క్లిక్ కాలేదు..

అదిరింది క్లిక్ కాలేదు..


జబర్దస్త్‌కు పోటీగా అదిరింది షో ప్రారంభించారు. కానీ అంతగా క్లిక్ కాలేకపోయింది. మొదటగా యాంకర్‌ సమీరను తీసేయడం, ఆ తరువాత ఆమె స్థానంలో భాను శ్రీ, రవిలను తీసుకోవడం రావడం వంటి మార్పులే దెబ్బకొట్టాయి. అలా మార్పులు చేర్పులు జరుగుతూనే వచ్చాయి.

వర్షెన్ 2.ఓ..

వర్షెన్ 2.ఓ..

అదిరింది షోకు వర్షెన్ 2.ఓ అన్నట్టుగా బొమ్మ అదిరిందిని ప్లాన్ చేశారు. మొదటి ఎపిసోడే సంచలనం సృష్టించింది. వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్‌తో ఏపీ అట్టుడికిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానులు ఆ కామెడీ స్కిట్, నిర్వహకులు, జీ తెలుగు యాజమాన్యంపై విరుచుకుపడ్డారు.

బొమ్మ అదిరింది హిట్..

బొమ్మ అదిరింది హిట్..

బొమ్మ అదిరింది తన మొదటి స్కిట్‌తోనే సెన్సేషనల్ అయింది. ఆ స్కిట్‌తొ సద్దాం, రియాజ్, హరి ఒక్కసారిగా సోషల మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆ గొడవను నాగబాబు ఇంకా పెద్దది చేసేశాడు. ట్రోలింగ్‌కు ధీటుగా స్పందిస్తూ కౌంటర్లు వేసేశాడు. అయితే దేని కారణంగానే తెలియదు గానీ మొత్తానికి బొమ్మ అదిరింది మాత్రం బిచానా సర్దేసినట్టు కనిపిస్తోంది.

రెండు వారాలు..

రెండు వారాలు..

గత వారంలోనూ బొమ్మ అదిరింది ప్రసారం కాలేదు. ఆ సమయంలో పార్టీకి వేళాయేరా అంటూ ఓ స్పెషల్ ఈవెంట్ వచ్చింది. ఇక రేపు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అసలు బొమ్మ అదిరింది ఉందా? లేదా? అన్నది కూడా ఎవ్వరికీ తెలియడం లేదు.

అందుకే అక్కడ..

అందుకే అక్కడ..

బొమ్మ అదిరింది కథ కంచికి చేరిందనే నాగబాబు యూట్యూబ్‌లో తన షోలతో బిజీగా ఉన్నాడని అంటున్నారు. కానీ నాగబాబును నమ్ముకుని వచ్చిన చమ్మక్ చంద్రకు మాత్రం ఇప్పుడు ఏ షోకూడా లేదని తెలుస్తోంది. మరి చమ్మక్ చంద్ర మళ్లీ ఎలా అలరిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X