twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్ రెండు మాస్ సినిమాల మధ్య ఓ క్లాస్ సినిమా..!?

    By Sindhu
    |

    'ఆరెంజ్" దెబ్బతో ఫ్యామిలీకి దూరమైన దర్శకుడు 'బొమ్మరిల్లు" భాస్కర్, నందమూరి క్యాంప్ లో చేరాడంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే..కళ్యాణ్ రామ్ కి భాస్కర్ ఓ కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చి కళ్యాణ్ రామ్-భాస్కర్ తో కమిటయ్యాడనీ వార్తలొచ్చాయి. అయితే లేటుగా తేలిన విషయమేంటంటే, నందమూరి క్యాంప్ లో భాస్కర్ అడుగు పెట్టిన మాట వాస్తవమేననీ, అయితే భాస్కర్ కథ చెప్పింది కళ్యాణ్ రామ్ కి కాదు, జూ ఎన్టీఆర్ కి అని తెలిసింది.

    బృందావనం" సినిమా తర్వాతే భాస్కర్, ఎన్టీార్ ని కలిసి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడనీ, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాకీ, బోయపాటి శ్రీను సినిమాకీ మద్య భాస్కర్ తో సినిమాకి ఎన్టీఆర్ టైమ్ కేటాయించాడనీ తెలుస్తోంది. అంటే రెండు మాస్ సినిమాల మధ్యలో ఓ క్లాస్ సినిమా..అంటూ జూ ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్నట్టే సురేందర్ రెడ్డి, భాస్కర్, బోయపాటి శ్రీనులతో వరుస సినిమాలు చేయనున్నాడన్నమాట. ఇదిలా వుంటే, గాసిప్స్ లో తన పేరు విన్పించగానే కంగారు పడ్డ కళ్యాణ్ రామ్, భాస్కర్ ని కలిసి ఓ సినిమా చేద్దామనే ప్రపోజల్ తెచ్చినట్టు సమాచారం.

    English summary
    Recently news came Bommarillu Bhaskar is going to direct Kalyan Ram but the latest buzz is Jr. NTR had joined with the list as Bhaskar had script suitable for Young Tiger, also bhaskar added that he is waiting for jr ntr dates. If he gets dates immediately he will start the movies it seems.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X