Don't Miss!
- Sports
వచ్చే సీజన్ ఆరో ట్రోఫీ పక్కా.. హామీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్
- News
టీడీపీ అడ్రస్ గల్లంతు.. మంత్రి బొత్స కామెంట్స్
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భర్త పేరు తొలగించిన మెగా డాటర్.. విడిపోవడానికి సిద్ధంగా మరో సెలబ్రిటీ జంట.. విడాకుల వార్తల జోరు
దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో విడాకుల వార్తలు జోరందుకొన్నాయి. ఇటీవల సమంత, అక్కినేని నాగచైతన్య విడాకులు వ్యవహారం మరిచిపోకముందే తాజాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల వార్త తెరపైకి వచ్చింది. ధనుష్, ఐశ్వర్య విడాకుల వార్త జాతీయ మీడియాను కుదిపేసింది. ఇలాంటి వార్తల మధ్య మెగాస్టార్ చిరంజీవి కూతురు సోషల్ మీడియాలో తన పేరు నుంచి భర్త కల్యాణ్ దేవ్ పేరును తొలగించడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

చిరంజీవి కూతురు మొదటి పెళ్లి
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గతంలో పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నది. తండ్రి, కుటుంబ సభ్యుల మనోభావాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం అభిమానులను షాక్ గురి చేసింది. అయితే శిరీష్, శ్రీజ దంపతులకు నివృతి పుట్టిన తర్వాత వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి.

భర్తపై వరకట్నం వేధింపుల కేసు
అయితే తన భర్త వేధిస్తున్నాడు. కట్నం తీసుకురావాలని హింసిస్తున్నాడు అనే ఆరోపణలపై శిరీష్‌పై శ్రీజ కేసు పెట్టారు. చివరకు తన మొదటి భర్తతో విభేదాలు పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో 2011లో విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత తన ఫ్యామిలీ చెంతకు రావడంతో ఆమె పెళ్లి కథ మధ్యలోనే ముగిసిపోయింది.

కల్యాణ్ దేవ్‌తో రెండో వివాహం
ఆ తర్వాత నాలుగైదు సంవత్సర అనంతరం కల్యాణ్ దేవ్‌తో శ్రీజ వివాహం 2016లో జరిగింది. మెగా ఫ్యామిలీ సపోర్ట్‌తో కల్యాణ్ దేవ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన నటించిన విజేత చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కల్యాణ్ దేవ్, శ్రీజ దంపతులకు నివిష్క అనే కూతురు పుట్టింది. అంతా సవ్యంగా సాగిపోతుందనే క్రమంలో శ్రీజ, కల్యాణ్ దేవ్ కాపురంలో కలతలు, విభేదాలు చోటు చేసుకొన్నాయనే వార్తలు ఫిలింనగర్లో గుప్పుమన్నాయి.

ఇన్స్టాగ్రామ్ నుంచి భర్త పేరు తొలగింపు
అయితే కల్యాణ్ దేవ్, శ్రీజ వైవాహిక జీవితం సమస్యల్లో పడిందనే ఊహగానాలు జోరుగా కొనసాగాయి. ఈ క్రమంలో శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో శ్రీజ కల్యాణ్ పేరు నుంచి కల్యాణ్‌ను తొలగించి శ్రీజ కొణిదెల మార్చుకోవడంతో మరింతగా అనుమానాలు బలపడ్డాయి. అయితే ఈ విషయంలో ఏం జరుగుతున్నదనేది మిస్టరీగా మారింది. మీడియాలో షికారు చేస్తున్న వార్తలు నిజమా? అబద్దామా? అనే విషయానికి సమాధానాలు లభించాల్సి ఉంది.

సూపర్ మచ్చి సినిమాకు దూరంగా కల్యాణ్ దేవ్
ఇక
ఇలాంటి
వివాదాస్పద
వార్తల
నడుమ
కల్యాణ్
దేవ్
తన
తాజా
చిత్రం
సూపర్
మచ్చి
ప్రమోషన్స్‌లో
పాల్గొనకపోవడంపై
మరిన్ని
రూమర్లు
క్రియేట్
అయ్యాయి.
అయితే
ప్రస్తుతం
వేరుగా
ఉంటున్న
కల్యాణ్
దేవ్
సూపర్
మచ్చి
ప్రమోషన్స్‌కు
కూడా
దూరం
ఉన్నారు.
ఈ
సినిమాకు
మెగా
హీరోలు
కూడా
సపోర్ట్
చేయకపోవడంతో
ఈ
వ్యవహారంపై
మరింతగా
అనుమానాలు
బలపడుతున్నాయి.
ఇదిలా
ఉండగా,
సంక్రాంతి
పండుగ
రేసులో
దిగిన
సూపర్
మచ్చి
చిత్రం
ప్రేక్షకుల
ఆదరణకు
నోచుకోలేకపోయింది.
ఈ
చిత్రం
బాక్సాఫీస్
వద్ద
స్టడీగా
నిలదొక్కులేకపోయింది.
ఇక
కల్యాణ్
దేవ్
ఈ
సినిమాకు
దూరంగా
ఉండటంతో
ఆయన
సినీ
జీవితం
ప్రశ్నార్థకంగా
మారింది.