మెగాస్టార్ చిరంజీవి నాకంటే ఎందులో గొప్ప..!?
చిరంజీవికి అత్యంత సన్నిహితురాలైన హీరోయిన్లలో ఒకరైన సుహాసినీ మణిరత్నం ఈ మధ్య 'ఎయిటీస్ సూపర్ స్టార్స్" రీ యూనియన్ అనే అత్యంత వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైయ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తదితరులతో పాటు, మన టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, నరేష్(విజయనిర్మల తనయుడు) హాజరయ్యారు.
వెంకటేష్ మాట ఎలా ఉన్నా..నరేష్ తో కలిపి తనను ఒకే గాటన కట్టడం పట్ల చిరంజీవి చాలా నొచ్చుకున్నారంట. దాదాపు రెండు దశాబ్దాల పాటు మెగాస్టార్ గా వెలిగిన తనను వెనకలైన్ లో నిల్చోబెట్టి..నరేష్ ను రజనీకాంత్ పక్కన కూర్చోబెట్టిన సుహాసినిపై చిరంజీవి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసారంట.
అయితే, నరేష్ మాత్రం..'నా కంటే చిరంజీవి ఎందులో గొప్ప? నేను 'నటించిన 'నాలుగు స్తంభాలాట", 'రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం వంటి చిత్రాలు సిల్వర్ జూబ్లీలు జరుపుకోలేదా? ఇక రాజకీయాల్లోకి వస్తే..చిరంజీవి ఎమ్మేల్యేగా పాలకొల్లులో పరాజయం చెందితే, నేను పార్లమెంటుకు బిజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయాను. అంతే కదా? అంటూ వాదిస్తున్నాడంట.


Click it and Unblock the Notifications











