RC16: రాంచరణ్ సినిమాలో మెగాస్టార్? ఫ్యాన్స్‌ను కిర్రాకెత్తిస్తున్న న్యూస్!

ఒకప్పుడు భారతీయ సినిమా దగ్గర మల్టీస్టారర్ సినిమాలు అంటే హడావుడి తక్కువే ఉండేది దీనితో సమాన స్టార్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పలు సినిమాలు చేసేసేవారు. అవి కూడా అంతే బ్రహ్మాండంగా రన్ అయ్యేవి కూడా.. కానీ ఇపుడు పరిస్థితులు మారాయి. ఒక మల్టీస్టారర్ సెట్ చెయ్యడమే గగనం అయితే దానిని అభిమానులు మెచ్చే విధంగా తీయడం అనేది దర్శకునికి కత్తి మీద సాములా మారిపోయింది.

అయినప్పటికీ పలు సినిమాలు వస్తున్నాయి. కానీ వీటిలోని మన తెలుగు సినిమా నుంచి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. ఇలా తెలుగులో బిగ్ ఫ్యామిలీస్ లో కొన్ని సినిమాలు పరంగా యువ హీరోస్ కి సపోర్ట్ చేసేలా లీడ్ బిగ్ స్టార్స్ సపోర్ట్ చేస్తూ వచ్చారు.

Is Chiranjeevi playing Crucial Role in Ram Charan s RC 16

కాగా ఇలాంటి సపోర్ట్ లు కొందరు హీరోలు వరకు కొంత సమయం వరకు ఓకే కానీ మంచి క్రేజ్ అండ్ మార్కెట్ వచ్చినప్పటికీ కూడా ఇదే కొనసాగితే అది నెగిటివ్ కామెంట్స్ నే తీసుకొస్తుంది అని చెప్పాలి. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యిన తర్వాత పలు సినిమాలు కోసం తాను ఫ్యామిలీ పరంగా గట్టి సపోర్ట్ నే అందుకున్నాడు.

అంతే కాకుండా తన తండ్రి సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవి చరణ్ కోసం పలు సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడం జరిగింది. ఇది చరణ్ సినిమాలకి చాలా ప్లస్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ అప్పట్లో చరణ్ కి సపోర్ట్ గా ఓకే కానీ ఇపుడుకి కూడా రామ్ చరణ్ నాన్న చాటు బిడ్డ అనే కామెంట్స్ ని తెచ్చుకుంటున్నాడు.

Is Chiranjeevi playing Crucial Role in Ram Charan s RC 16

ఎంతవరకు నిజం ఉంటాయో లేదో కానీ రామ్ చరణ్ పలు సినిమాలు విషయంలో ఇప్పటికీ చిరంజీవి హస్తం ఉంటుంది అని పలు కామెంట్స్ ఉన్నాయి. చిరంజీవి ఆమోదంతోనో లేక పరోక్ష సపోర్ట్ తో పలువురు దర్శకులు రామ్ చరణ్ తో సినిమాలు చేస్తారు అనే టాక్ ఉంది. అలాగే ఇపుడు మరో క్రేజీ రూమర్ రామ్ చరణ్ సినిమాపై వినిపిస్తుంది. వీటి ప్రకారం ఇపుడు దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రెజెన్స్ ఉండబోతుంది అంటూ పలు రూమర్స్ ఇపుడు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం బుచ్చిబాబు చిరంజీవిని సంప్రదించనున్నారని గాసిప్స్ వైరల్ గా మారాయి. దీంతో ఇప్పటికీ రామ్ చరణ్ నాన్న సపోర్ట్ నే తీసుకొని సస్టైన్ అవుతున్నాడు అనే కామెంట్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ గేమ్ ఛేంజర్ సినిమాకి ఎప్పుడు లేని రేంజ్ నెగిటివ్ ని రామ్ చరణ్ చూడడం జరిగింది. ఇపుడు మళ్ళీ ఇలాంటి స్టెప్స్ అంటే అది మైనస్ అవుతుందా లేక ప్లస్ అవుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఈ రూమర్ లో ఎలాంటి నిజం లేదనే తెలుస్తుంది. ఆల్రెడీ ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు సో మళ్ళీ ఇలాంటివి అంటే కొంచెం ఆలోచించాల్సిందే అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: ram charan chiranjeevi rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X