ఇంత జరుగుతోందా?: 'సైరా' ఎటు పోతోంది.., మధ్యలో గుణశేఖర్ ఎందుకు!..

Recommended Video

'సైరా' డౌటే.. మధ్యలో గుణశేఖర్ ఎందుకు !

తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చినా!.. సినిమాల్లో చిరంజీవి ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నంబర్.150 రొటీన్ కథా ఫార్మాట్ అయినప్పటికీ.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

తన తదుపరి చిత్రానికి మాత్రం చిరంజీవి విభిన్న కథాంశాన్నే ఎన్నుకున్నారు. 'సైరా' అంటూ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడానికి సిద్దమైపోయారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. సినిమా షూటింగ్ సాగుతున్న తీరు మాత్రం చిరంజీవికి ఎక్కడో తేడా కొడుతుందోన్న అనుమానాలను కలిగిస్తోందట..

 ఏంటీ ప్రచారం?:

ఏంటీ ప్రచారం?:

నిజానికి సైరా షూటింగ్ కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. అయినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి షెడ్యూల్ వేగంగానే ఫినిష్ చేశారు. కానీ తొలి షెడ్యూల్ రషెస్ చూశాక.. చిరంజీవి కాస్త అసంతృప్తికి లోనయ్యారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

 క్లారిటీ లేదు..:

క్లారిటీ లేదు..:

దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సినిమాను స్టైలిష్ గానూ, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతోనూ తెరకెక్కించడంలో ఆయనకు మంచి పేరే ఉంది. అలాంటిది.. చిరంజీవి మాత్రం సురేందర్ రెడ్డిపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారన్న దానిపై పూర్తి క్లారిటీ లేదు.

 మధ్యలో గుణశేఖర్ ఎందుకు?:

మధ్యలో గుణశేఖర్ ఎందుకు?:

సురేందర్ రెడ్డిపై అసంతృప్తి మాత్రమే కాదు. ఒకానొక దశలో సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ను సంప్రదిద్దామా? అన్న ఆలోచన కూడా చేశారట చిరంజీవి. ఇందులో నిజానిజాలెంతో తెలియదు కానీ దర్శకుడు సురేందర్ రెడ్డిని అవమానపరిచేలా ఈ ప్రచారం జరుగుతున్నట్లు అర్థమవుతోంది.

 అనుకున్నదేది జరగట్లేదు..:

అనుకున్నదేది జరగట్లేదు..:

సైరా సినిమాకు మొదటి నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. ఏది అనుకున్నట్లుగా జరగట్లేదు. షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దానికి తోడు సెట్స్ మీదకు వెళ్తున్న సమయంలోనే కెమెరామెన్ రవివర్మన్ తప్పుకున్నారు. దీంతో రత్నవేలు వచ్చి చేరారు. ఇక మ్యూజిక్ సంగతి కూడా అంతే. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో థమన్ వచ్చి చేరాడు.

 నయన్ కూడా షాక్ ఇస్తుందా?

నయన్ కూడా షాక్ ఇస్తుందా?

సైరాకు ఇప్పటికే టెక్నీషియన్స్ ఝలక్ ఇవ్వగా.. హీరోయిన్ నయన్ కూడా షాక్ ఇస్తుందా? అన్న భయం పట్టుకుంది. సినిమాకు సంబంధించి నయనతార డేట్స్ ఇంకా ఖరారు కాలేదట. ఇదే విషయమై కనుక్కునేందుకు దర్శకుడు సురేందర్ రెడ్డి ఆమెకు ఫోన్ చేసినా.. అటు నుంచి ఎటువంటి స్పందన లేదట. దీంతో నయనతార 'సైరా'లో ఉంటారా?.. లేరా?.. అన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X