విడాకుల బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్.. ఇన్‌స్టాలో భర్త ఫొటోలు డిలీట్..

ఇటీవల విడాకులు తీసుకునేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. అందులో సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏ సెలబ్రెటీ జంట విడిపోతారో.. దూరమవుతారో చెప్పడం మాత్రం కష్టం. అయితే.. కొంతమంది డైరెక్ట్ గా విడాకులు ప్రకటిస్తే.. మరికొందరు ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా డిఫెరెంట్ పోస్టులు, ఫోటోలను పెడుతుంటారు. మరికొందరైతే.. తన ఎక్స్ పార్టనర్ ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసి ఆ తర్వాత మెల్లగా తమ విడాకుల ప్రకటన చేశారు. ఇప్పుడీ జాబితాలోకి టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చేరిందా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. టాలీవుడ్ యాక్టరస్ కలర్స్ స్వాతి. ఈ ముద్దుగుమ్మ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కలర్స్ అనే టీవీ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం ద్వారా సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. సినిమాల్లో మొదట స్వాతి బాల నటిగా నటించడంతో పాటు హీరోయిన్‌గానూ పలు సినిమాల్లో నటించింది. ఈ అమ్మడు నటిగా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్'తో హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో త్రిష చెల్లి పాత్రలో నటించి అదరగొట్టింది.

Is Colours Swathi Reddy Divorce With Husband Vikas Vasu

ఇక నాని హీరోగా తెరకెక్కిన 'అష్టా చమ్మా' సినిమాతో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ కావడంతో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అలా.. స్వామి రారా, కార్తికేయ, గోల్కొండ హైస్కూల్ , త్రిపుర, లండన్ బాబులు వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా అదరగొట్టింది. అలాగే.. మిరపకాయ్, కందిరీగ, బంగారు కోడిపెట్ట వంటి సినిమాల్లో గెస్ట్ రోల్స్ ల్లో నటించింది.

ఇక చివరిగా 2023లో మంత్ ఆఫ్ మధు సినిమాలో నటించింది కలర్స్ స్వాతి. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు 2018లో కేరళకు చెందిన పైలట్ వికాస్ వాసును పెళ్లి చేసుకుంది స్వాతి. అయితే.. గత కొంతకాలంగా వీరి సంసార జీవితంలో మనస్పర్థలు వచ్చి నట్లు ప్రచారం జరిగింది.స్వాతి కొన్నాళ్లకే ఆయన నుంచి విడి పోయిందనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో 'మంత్ ఆఫ్ మధు' సినిమా ప్రమోషన్స్ లో తన భర్తపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

తాజాగా మరోసారి స్వాతి విడాకుల అంశం తెరపైకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం కలర్స్ స్వాతి సోషల్ మీడియాలో అకౌంట్లలో తన పెళ్లి ఫొటోలతో పాటు తన భర్త ఫోటోలను డిలీట్ చేసేంది. దీంతో కలర్స్ స్వాతి తన విడాకుల విషయాన్ని ఇన్‌డైరెక్టుగా చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం లో ఎంత నిజముందో తెలియాలంటే.. స్వాతి లేదా ఆమె భర్తయినా అపిషియల్ గా ప్రకటించాల్సిందే.

More from Filmibeat

Read more about: colours swathi reddy vikas vasu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X