వివాదంలో నంది అవార్డు దాసరికి నందిఅవార్డుఫై మండిపడుతున్న అభిమానులు
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులఫై అభిమానులు మండిపడుతున్నారు. ఉత్తమ నటుడు అవార్డును దర్శకరత్న 2009 నంది అవార్డులు వివాదంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా ఉత్తమనటుడు అవార్డును దాసరి నారాయణరావు ఇవ్వడంపై పీఆర్పీ వ్యాఖ్యనిస్తూ...నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం తమకిష్ఠమొచ్చినట్టు పంపకం జరిపిందని విమర్శించారు. 'మగధీర" సినిమాకి గాను రామ్ చరణ్ కు ఉత్తమనటుడు అవార్డు వస్తుందని ఆశించారు. అయితే అలా జరగకపోవడం వల్ల పీఆర్పీ నంది అవార్డులపై ఈవిధంగా కామెంట్ చేస్తుంది. ఇదే విషయం గురించి నంది అవార్డుల కమిటీ ఛైర్మెన్ పి.చంద్రశేఖర్ రెడ్డిని అడిగితే..మాకు వచ్చిన 47 సినిమాల పోటీలో దాసరి నటన బాగుందనిపించింది అందుచేతే ఆయనకు ఉత్తమనటుడు అవార్డునిచ్చాం అని అన్నారాయన..!
అయితే ఈ సినిమాను ప్రజారాజ్యం పార్టీని, చిరంజీవిని విమర్శిస్తూ నిర్మించారని దాసరి ఫై అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాసరికి ఉత్తమ నటుడు అవార్డును ప్రకటించడంతో అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ చిత్రంలో దాసరి చేసింది ఏమి లేదని, ఆయన ఏమి చెప్పదలచుకున్నారో కూడా అర్ధంకాలేదని అభిమానులు అంటున్నారు. కాంగ్రెస్ వాది అయిన దాసరికి ప్రభుత్వం ఇచ్చిన రివార్డు అని మరికొందరు అభిమనులు అంటున్నారు. దీనికి స్పందించిన దాసరి అవార్డు వచ్చినప్పుడు ప్రశంసలతో పాటు విమర్శలు వస్తాయని అన్నారు.


Click it and Unblock the Notifications











