సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కోర్ట్ హీరోయిన్? మెడలో పసుపు తాడుతో శ్రీదేవి

చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతుండగా.. మరికొందరు మాత్రం తమ పెళ్లిని, ప్రేమాయణాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారు. సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్, పెళ్లి చేసుకుని ఫోటోలతో షాకిస్తున్నారు. ఇది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా కోర్ట్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవికి పెళ్లయిపోయినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

ఘన విజయం సాధించిన కోర్ట్
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన కోర్ట్ సినిమా మార్చి 14న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. విజయ్ బుల్గానియన్ సంగీత దర్శకత్వం వహించగా.. రామ్ జగదీష్ కోర్ట్ మూవీని డైరెక్ట్ చేశారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేనేని ఈ సినిమాను నిర్మించగా.. నాని సమర్పకుడిగా వ్యవహరించారు.

is Court Movie Fame Sridevi Apalla secretly knot tied

నానికి లాభాలు అందించిన కోర్ట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి రూ.10 కోట్ల బడ్జెట్‌తో కోర్ట్ సినిమాను తెరకెక్కించారు. ఆంధ్రా , నైజాం, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో ఈ సినిమాకు రూ.10 కోట్ల మేర బిజినెస్ చేసింది. కోర్ట్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.11 కోట్ల షేర్.. రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలని బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా విలువ కట్టారు ట్రేడ్ పండితులు. కోర్ట్ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేసరికి తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్ల రూపాయల షేర్, 12 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్‌లో 12 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో కలిపి కోర్ట్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయల షేర్.. 80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌తో నిర్మాత నానికి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.

జాబిలి కోసం కుర్రాళ్లు విలవిల
ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జాబిలి కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. అసలు ఎవరు ఈ అమ్మాయి? ఈమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ? అనేది తెగ వెతికేశారు. ఈ అమ్మాయి అసలు పేరు శ్రీదేవి ఆపళ్ల.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫేమస్. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈమెకు లక్షల్లో ఫాల్లోవర్స్ ఉన్నారు. కోర్ట్ సినిమా కోసం హీరోయిన్ కోసం వెతుకుతుండగా దర్శగా రామ్ జగదీశ్‌కు శ్రీదేవి చేసిన రీల్ నచ్చడంతో ఆమెను ఆడిషన్స్‌కు పిలిచారు. అక్కడ తన ప్రతిభ నిరూపించుకుని అవకాశం దక్కించుకుంది శ్రీదేవి. మొదటి సినిమాయే అయినా ఏమాత్రం తడబడకుండా తన సహజ నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది శ్రీదేవి. ఆమె లుక్స్, అందం కుర్రాళ్లు పిచ్చెక్కిచ్చింది.

కారు కొనేసిన శ్రీదేవి
ఈ సినిమాతో శ్రీదేవికి మరింత పాపులారిటీ దక్కగా.. తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్లు క్యూకడుతున్నాయి. ఈమె దూకుడు ఇలాగే కొనసాగితే టాప్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే లగ్జరీ కారు కొనుగోలు చేసి షాకిచ్చింది. చేసింది ఒక్క సినిమాయే అప్పుడే కారు కొనేసిందా అంటూ కామెంట్స్ పెట్టారు. తాజాగా శ్రీదేవికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఈమెకు పెళ్లయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.

మెడలో పసుపు తాడుతో శ్రీదేవి
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా తన సోదరుడికి శ్రీదేవి రాఖీ కట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో శ్రీదేవి మెడలో పసుపు తాడు ఉండటంతో నెటిజన్లు అవాక్కయ్యారు. ఈమెకు సీక్రెట్‌గా పెళ్లయిపోయిందా? పెళ్లి కొడుకు ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. అయితే రక్షా బంధన్‌కు ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రతం కావడంతో శ్రీదేవి ఇంట్లో వ్రతం ఆచరించి.. పూజ తర్వాత పసుపు తాడుకు కట్టిన లక్ష్మీదేవి కాయిన్ మెడలో వేసుకుంది. దీంతో ఇది తాళిబొట్టుగా పొరపడిన నెటిజన్లు షాక్ అయ్యారు. సో అదన్న మాట అసలు విషయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X