దర్శకుడు తేజను ముప్పుతిప్పలు పెడుతున్న యువ హీరో.. షూటింగ్‌కు రాకుండా కాకమ్మ కథలు!

టాలీవుడ్‌లో చాలా కాలంగా దగ్గుబాటి కుటుంబం నుంచి అభిరామ్ హీరోగా రాబోతున్నారనే వార్తలు అప్పుడప్పుడు గుప్పుమంటూ వినిపించాయి. అయితే ఎట్టకేలకు ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో అహింస అనే చిత్రం ద్వారా అభిరామ్ ఎంట్రీ జరిగిపోయింది. అభిరామ్ చిత్రం రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో శరవేగంగా జరుపుకొంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నది. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పలుమార్లు వాయిదాల పడుతుండటం యూనిట్‌కి ఇబ్బందికరంగా మారింది.

అయితే ప్రస్తుతం కరోనా పీడ వదిలి సినిమాలన్నీ వేగంగా షూటింగులు పూర్తి చేసుకొనేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలో షూటింగ్‌కు రాకుండా దర్శకుడు తేజను అభిరామ్ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే మీడియాలో కూడా గుప్పమనడంతో ఈ వార్త సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

 Is Daggubati Abhiram troubling Director Teja for completion of Ahimsa?

అహింస చిత్రానికి సంబంధించి అభిరామ్‌తో మరో వారం రోజులు షూటింగ్ మిగిలి ఉంది. అయితే దర్శకుడు తేజ తన షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకొని కబురు పంపితే.. తన కాలికి గాయమైంది. షూటింగ్‌కు రాలేనని సమాధానం చెప్పారు. దాంతో తేజ షూటింగ్ వాయిదా వేశారు అనే విషయాన్ని తేజ సన్నిహితులు మీడియాకు వెల్లడించారు.

అయితే అభిరామ్‌కు సన్నిహితులు కొందరు షాకింగ్ విషయాన్ని వెల్లడించారని టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్‌సైట్ భారీ కథనాన్ని వెల్లడించింది. తాజా కథనం ప్రకారం.. అభిరామ్‌కు కాలికి గాయం కాలేదు. అతడు తన స్నేహితులతో ఫుల్లాగా పార్టీ చేసుకొంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్‌కు రావడం లేదు. కాకమ్మ కబుర్లు చెబుతూ షూటింగ్ వాయిదా వేస్తున్నాడు అని కథనంలో వెల్లడించింది. అయితే అభిరామ్ వ్యవహారంపై దర్శకుడు తేజ తీవ్ర అసహనంతో ఉన్నాడు. ఈ విషయాన్ని అభిరామ్ తండ్రి, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అభిరామ్‌ను షూటింగ్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు అని సదరు వెబ్‌సైట్ కథనంలో తెలిపింది.

 Is Daggubati Abhiram troubling Director Teja for completion of Ahimsa?

అయితే అభిరామ్ వ్యవహారంపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తమవుతున్నది. స్వతహాగా తేజ స్ట్రిక్ట్. పని విషయంలో చాలా నిబద్దతతో ఉంటాడు. అలాంటి దర్శకుడిని అభిరామ్ ముప్పు తిప్పలు పెట్టడమేమిటి అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కెరీర్ ఆరంభంలో అభిరామ్ ఇలా వ్యవహరించడం సరికాదు అని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతున్నది. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే.. రానున్న రోజుల్లో అభిరామ్‌తో దర్శకులు పనిచేయడం కష్టమే అనే గుసగుసలు మీడియాలో వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X