'దమ్ము' యూనిట్ పై రూమరా.. నిజమా
ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము సమస్యల్లో ఇరుక్కుందంటూ నెట్ లో ప్రచారం జరుగుతోంది. దమ్ము షూటింగ్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడ ఇప్పుడు విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దాంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. మరో ప్రక్క కెమెరా అసిస్టెంట్ ఒకరు మిస్సయ్యారు. అతని కోసం విపరీతంగా సెర్చింగ్ జరుగుతోంది అంటూ నెట్ లో దమ్ము చిత్రం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఎన్టీఆర్ అబిమానులకు అవి నిజమైన న్యూస్ లా లేక రూమర్సా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక షూటింగ్ డిసెంబర్ మూడవ వరకూ వాయిదా వేసారని చెప్పుకుంటున్నారు. అయితే అధికారికంగా ఈ చిత్రం గురించి కానీ, ఈ రూమర్స్ గురించి కానీ ఏ న్యూస్ బయిటకి రాలేదు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ముపైనే ఎన్టీఆర్ పూర్తిగా దృష్టి పెడుతున్నారు.
సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు.అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు. తన సక్సెస్ మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు. ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తిక నటిస్తున్నారు. తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు. భానుప్రియ.. ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది. ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











