Spirit:ప్రభాస్‌తో ఆ స్టార్ హీరోయిన్ రెండోసారి.. ఆ బ్యూటీకి 20 కోట్ల రెమ్యునరేషన్?!
యానిమల్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాను బాలీవుడ్‌లో అగ్ర సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ గ్రాండ్‌గా నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక వ్యవహారం జోరందుకొన్నట్టు కనిపిస్తున్నది. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించిన వార్త ఒకటి మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
స్పిరిట్ సినిమా కథను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముందే లీక్ ఇచ్చేశాడు. ఓ సిన్సియర్, స్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కథ. ఈ సినిమాలో హింస, యాక్షన్ సన్నివేశాలు యానిమల్ సినిమాకు రెండింతలు ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాతో 2000 కోట్లు కొట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమా ఇప్పటి వరకు చూడని ప్రభాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమాపై అంచనాలు ఎంతైనా పెట్టుకోవచ్చనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

వాస్తవానికి స్పిరిట్ మూవీ షూటింగ్ 2025 సంవత్సరంలోనే ప్రారంభం కావాల్సింది. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ షూటింగులో ప్రభాస్ గాయపడటం.. ఆ క్రమంలో ఆయన ట్రీట్‌మెంట్‌కు యూరప్ వెళ్లడంతో ఈ సినిమా షూట్ ఆలస్యమైంది. అలాగే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూట్ ముగించిన తర్వాత ఈ మూవీని 2025 అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు. అలాగే 2026 సంవత్సరంలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు.
స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోనున్నారు. ఈ సినిమాను ఎక్కువ శాతం మెక్సికో లాంటి ప్రాంతాల్లో షూట్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని అందమైన లోకేషన్లలో ఛేజింగ్స్, ఫైట్స్ షూట్ చేయాలని అనుకొంటున్నట్లు సందీప్ రెడ్డి తెలిపారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఇలాంటి క్రేజ్ ఉన్న ప్రాజెక్టులో ప్రభాస్ పక్కన హీరోయిన్ ఎవరనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోయింది. అయితే చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మీడియాలో పలువురు భామల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్‌ను ఖరారు చేసినట్టు ఓ వార్త హల్‌చల్ చేస్తున్నది. దాంతో రెబల్ ఫ్యాన్స్ మరోసారి అనందంలో మునిగిపోయారు.

అయితే స్పిరిట్ సినిమాలో నటించేందుకు దీపిక పదుకోన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమెకు భారీగా అంటే.. సుమారుగా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాత, దర్శకులు అంగీకరించారు. దాంతో ఆమె రెండోసారి ప్రభాస్ మూవీలో నటించే హీరోయిన్‌గా క్రెడిట్ సంపాదించుకొన్నారు. ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో దీపిక పదుకోన్ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











