Kalki 2898 AD తర్వాత మరో ప్యాన్ ఇండియా మూవీలో దీపిక పదుకోన్.. దక్షిణాదిలో ఆ స్టార్ హీరోతో కలిసి..!

బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న దక్షిణాది భామ దీపిక పదుకోన్ ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై కన్నేసింది. హిందీ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగిన దీపిక ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న Project K (Kalki 2898 AD) అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ K సినిమా షూటింగులో బిజీగా ఉన్న సమయంలోనే దక్షిణాదిలో పలు చిత్రాల్లో స్టార్ హీరోల చిత్రాల్లో భారీ ఆఫర్లు వస్తున్నాయనేది సినీ వర్గాల సమాచారం. ఆ సినిమా వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం తమిళంలతోపాటు పలు భారతీయ భాషల్లో స్టార్ హీరో సూర్యతో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ కంగువా సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా టీజర్‌ను జూలై 23వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికీ కంగువా సినిమా టీజర్ గురించి దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Is Deepika Padukone to pair Suriya in Kanguva Part 2 after ProjectK?

అయితే తాజా సమాచారం ప్రకారం కంగువా చిత్రం రెండు భాగాలుగా ఉంటుంది. తొలి భాగంలో బాలీవుడ్ తార దిశా పటానీ నటిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించడానికి సిద్దమవుతున్నారు. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది అని సినీ వర్గాలు వెల్లడించాయి.

అయితే కంగువా 2 సీక్వెల్‌ కోసం దీపిక పదుకోన్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. కంగువా 2 లో నటించాలని నిర్మాత జానవేల్ రాజా ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అయితే ఇంకా ఈ ఆఫర్ వ్యవహారం పూర్తిగా కొలిక్కి రాలేదని, త్వరలోనే స్టూడియో గ్రీన్ సంస్థ దీపిక గానీ... మరో హీరోయిన్ ఎంపిక విషయం గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

Is Deepika Padukone to pair Suriya in Kanguva Part 2 after ProjectK?

ఇదిలా ఉండగా, దీపిక పదుకోన్ హిందీలో వరుస ఫ్లాప్‌లో ముందుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో సౌత్ ఇండియాలో భారీ ప్రాజెక్టులపైనే కోటి ఆశలు పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. Project K తో బిజీగా మారిపోయారు. Kanguva ప్రాజెక్టులో కూడా భాగమైతే ఇక దక్షిణాదిలో కూడా బిజీగా మారిపోయే అవకాశం ఉంది అని సినీ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X